నేటి నుంచి మూడో విడత రిజిస్ట్రేషన్ ప్రారంభం The third phase will start from today
Bharath NewsJuly 01, 2023
0
నేటి నుంచి మూడో విడత రిజిస్ట్రేషన్ ప్రారంభం
హైదరాబాద్HYDERABAD : డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్- తెలంగాణ దోస్త్ రెండో విడతలో 49,267 మంది విద్యార్థులు డిగ్రీ కళాశాలల్లో సీట్లు పొందారు.ఈ మేరకు ఆన్‌లైన్‌లో ఆయా యునివర్సిటీల ఉపకులపతులు, రిజిస్ట్రార్లతో కళాశాల విద్యాశాఖ కమిషనర్ వాకాటి కరుణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య లింబాద్రి ఉపాధ్యక్షులు వెంకటరమణ మహమూద్ సమావేశం నిర్వహించారు. నైపుణ్య కోర్సులపై దృష్టిపెట్టాలని జిల్లాల్లోనూ విద్యార్థులకు దోస్త్‌పై అవగాహన పెంచాలని కరుణ సూచించారు. అనంతరం ఉన్నత విద్యామండలి కార్యాలయంలో సీట్లను కేటాయించడంతోపాటు మూడో విడత కాలపట్టికను వెల్లడించారు.మొత్తం సీట్లు పొందిన వారిలో కామర్స్ బీబీఏ సహా 21,255, లైఫ్ సైన్సెస్ 11,944, ఫిజికల్ సైన్సెస్- 9,076, ఆర్ట్స్- 6,307, డేటా సైన్స్- 431, ఇతర కోర్సులో 81 మంది ఉన్నారు. తొలి విడతలో 73,220 మంది సీట్లు దక్కించుకున్నా సెల్ఫ్ రిపోర్టింగ్ 49 వేల మందే చేశారు. లింబాద్రి మాట్లాడుతూ తాజాగా సీట్లు పొందిన వారు ఈ నెల 1 నుంచి 14 వరకు ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోవాలని సూచించారు. రెండు విడతల్లోనూ సీట్లు పొందిన వారు కూడా మళ్లీ చేయాలన్నారు. కార్యక్రమంలో తెలంగాణ మహిళా యునివర్సిటీ, పాలమూరు యునివర్సిటీ ఉపకులపతులు విజ్జులత లక్ష్మీకాంత్‌రాథోడ్, కళాశాల విద్యాశాఖ ఆర్‌జేడీ ఆచార్య యాదగిరి విద్యామండలి కార్యదర్శి శ్రీనివాసరావు అకడమిక్ గైడెన్స్ ఆఫీసర్ తిరువెంగళచారి దోస్త్ సాంకేతిక సమన్వయకర్త గజేంద్రబాబు హెల్ప్‌డెస్క్ సమన్వయకర్త విజయరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా మూడో విడత రిజిస్ట్రేషన్‌ను ఈ నెల 1 నుంచి 14 వరకు రూ.400 రుసుం చెల్లించి చేసుకోవచ్చు. వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్న వారికి 20న సీట్లు కేటాయిస్తారు.
మరిన్ని వార్తల కోసం.... * నేటి నుంచి మూడో విడత రిజిస్ట్రేషన్ ప్రారంభంఇక్కడ క్లిక్ చేయండి * రానున్న నాలుగు రోజుల్లో భారీ వర్షాల హెచ్చరికఇక్కడ క్లిక్ చేయండి * గ్రూప్ 4 పరీక్ష రాస్తూ సెల్‌ఫోన్‌తో పట్టుపడ్డ అభ్యర్థిఇక్కడ క్లిక్ చేయండి * గ్రూపు 4 కు పకడ్బందీ ఏర్పాట్లు నేడు 2878 కేంద్రాల్లో పరీక్షలుఇక్కడ క్లిక్ చేయండి