వర్షాల వల్ల ఇల్లు కూలిన బాధితులను ఆదుకుంటాం
* ప్రజాసేవకు ప్రథమ ప్రాధాన్యం
* నిరుపేద కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుంది
* ప్రజాహితం మా అభిమతం
* ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా
తాండూర్ Tandur News భారత్ ప్రతినిధి : తాండూర్ పట్టణంలో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారి ఆదేశానుసారం ఇటీవల ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఇల్లు కూలిన బాధితులను ఎంపీపీ బాలేశ్వర గుప్తా, మండల పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ విట్టల్ నాయక్ జిల్లా కో ఆప్షన్ అధ్యక్షులు అక్బర్ బాబ, ఇతర సీనియర్ నాయకులు మండల పరిధిలో విస్తృతంగా పర్యటించి పరామర్శించారు.అనంతరం వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారి ఆదేశానుసారం మండల వ్యాప్తంగా వివిధ గ్రామాలలో కొలుస్తున్న వర్షాల కారణంగా ఇల్లు కూలిన సుమారు 20 నిరుపేదలను పరామర్శించి వారి మనసులో ధైర్యాన్ని నింపామన్నారు.ఇల్లు కూలిన నిరుపేదల వివరాలను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువెళ్లి సత్వరమే బాధితులకు లబ్ధి చేకూరే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్డిఆర్ఎఫ్ నిధుల కింద సత్వరమే బాధితులకు ఆర్థిక సహాయం అందే విధంగా కృషి చేస్తామన్నారు.
ప్రభుత్వం నిరుపేదలకు అందించే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో ఇల్లు కూలిన నిరుపేదలకు ప్రథమ ప్రాధాన్యం ఇచ్చే విధంగా కృషి చేయడమే కాకుండా ఆ దిశగా ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్తామన్నారు.ఇల్లు కూలిన బాధితులను పరామర్శించే క్రమంలో బానాపూర్ గ్రామంలో వార్త్యా శంకర్ నాయక్ కు సంబంధించిన కూలిన ఇంటిని పరిశీలించి బాధిత కుటుంబాన్ని పరామర్శించి వారిలో మనో ధైర్యాన్ని నింపి ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా అందించారు.ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రమేష్, అచ్యుతాపూర్ సర్పంచ్ మధుసూదన్ రెడ్డి, దేవనూర్ సర్పంచ్ ఆకుల శివకుమార్, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ కృష్ణకుమార్, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు అమర్నాథ్ రెడ్డి, టిఆర్ఎస్ మండల రైతు సంఘం అధ్యక్షులు అరవింద్ కుమార్ రెడ్డి, సాయిలు, ముద్దాయి పేట శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.