సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపిన మైనార్టీలు
తాండూర్ Tandur News భారత్ ప్రతినిధి : పేద మైనార్టీలు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు గారు మైనార్టీ సంక్షేమానికి పెద్దపీట వేస్తూ బీసీ తరహా బ్యాంకుతో సంబంధం లేకుండా లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.ఈ సంధర్బంగా బిఆర్ఎస్ విద్యార్థి భాగం తాండూర్ ఇంచార్జ్ జిలాని మైనార్టీ విద్యార్థి నాయకులు షోయబ్ నాసర్ ఖాన్ ఆకీప్ హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వం మైనార్టీ అభివృద్ధికి సంక్షేమానికి కట్టుబడి ఉందని దానిలో భాగంగానే దేశంలో ఎక్కడ లేని విధంగా పేద మైనార్టీల కోసం మైనార్టీ గురుకుల సంస్థను ఏర్పాటు చేసి దాదాపు 200 పైగా మైనార్టీ గురుకుల పాఠశాల మరియు జూనియర్ కళాశాలను ఏర్పాటు చేసి పేద మైనార్టీ విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్యను అందిస్తూ విద్యుత్ తో పాటు వసతి పౌష్టిక ఆహారం అందిస్తూన్నారు. ఈరోజు మైనార్టీ విద్యార్థులు డాక్టర్లుగా ఇంజనీర్లు గ్రూప్స్ లో మరియు లాయర్స్ గా ఉపాధ్యాయులుగా తయారవుతున్నారు.పేద మైనార్టీ ముస్లింలకు లక్ష రూపాయల సహాయం మహోత్తరమైన నిర్ణయం అని మైనార్టీలందరూ సీఎం కేసీఆర్ కు రుణపడి ఉంటారని తెలిపారు. రానున్న రోజుల్లో మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం రావడం ఖాయమని వారు అన్నారు.