అసెంబ్లీ ఎన్నికల తర్వాతే గ్రూప్3
* గ్రూప్ 2 నవంబర్కు మారడంతో గ్రూప్ 3 మరింత లేట్
* నవంబర్ లేదా డిసెంబర్లో ఎన్నికలు జరగవచ్చని ప్రచారం
* గ్రూప్1 మెయిన్స్ కూడా ఎన్నికల తర్వాతే నిర్వహించేలా టీఎస్పీఎస్సీ ప్లాన్
* ఇతర పరీక్షలపై గ్రూప్ 2 ఎగ్జామ్ రీషెడ్యూల్, ఎన్నికల ప్రభావం
హైదరాబాద్ Hyderabad News భారత్ ప్రతినిధి : రాష్ట్రంలో గ్రూప్ 2 ఎగ్జామ్ రీషెడ్యూల్ కావడంతో దాని ప్రభావం పలు పరీక్షలపై పడుతున్నది. అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో నిర్వహించాలనుకున్న గ్రూప్ 3 ఎగ్జామ్.ఇప్పట్లో జరిగే అవకాశం కనిపించడం లేదు. దీనికి తోడు గ్రూప్ 1 మెయిన్ ఎగ్జామ్ నిర్వహణపైనా సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ రెండు పరీక్షలూ ఎన్నికల తర్వాతే నిర్వహించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే గ్రూప్ 3 పరీక్ష తేదీలను ఇంతవరకూ ప్రభుత్వం ప్రకటించలేదు. ముందుగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 29, 30వ
తేదీల్లో గ్రూప్ 2 నిర్వహించాల్సి ఉంది. అయితే, ఈనెలలోనే గురుకుల పరీక్షలు ఉండడంతో గ్రూప్-2 వాయిదా వేయాలని అభ్యర్థులు పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. దీంతో సర్కారు నవంబర్ 2, 3 తేదీలకు రీషెడ్యూల్ చేసింది. ఈ పరీక్ష తేదీల మార్పుతో మిగిలిన పరీక్షలపై ప్రభావం పడింది. నిరుడు డిసెంబర్లో 1,363 గ్రూప్-3 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వగా. 5.36 లక్షల మంది అప్లై చే సుకున్నారు. నోటిఫికేషన్ ఇచ్చి 8 నెలలు అవుతున్నా పరీక్ష తేదీని ప్రకటించలేదు. తీరా పరీక్షను అక్టోబర్, నవంబర్ నెలల్లో పెట్టేందుకు ఎర్పాట్లు చేస్తుండగా గ్రూప్-2 పరీక్ష నవంబర్కు రీ షెడ్యూల్ అయింది. దీంతో గ్రూప్-3 పరీక్ష ఇప్పట్లో కష్టంగానే మారింది. ఎన్నికల తర్వాతే ఆ పరీక్షలు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల హడావుడి మొదలైంది. అక్టోబర్లో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశముందని ప్రచారం జరుగుతున్నది. అక్టోబర్లోనే నోటిఫికేషన్ వస్తే
నవంబర్, డిసెంబర్లో ఎన్నికలు జరిగే చాన్స్ ఉంది. దీంతో ఆయా నెలల్లో పరీక్షలు నిర్వ హించడం కష్టమని టీఎస్పీఎస్సీ చెబుతోంది. మరోపక్క గ్రూప్-1 మెయిన్స్ కూడా నిర్వహించాల్సి ఉంది. కానీ, గ్రూప్-1 ప్రిలిమ్స్ నిర్వహణపై కోర్టులో కేసు నడుస్తోంది. ఈ తీర్పు వస్తేనే ఫైనల్ కీ ఇచ్చి ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉంది. గ్రూప్-1 రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత కనీసం 2, 3 నెలలు మెయిన్ ఎగ్జామ్స్కు ప్రిపరేషన్కు టైమ్ ఇవ్వాలి. దీంతో నవంబర్లో గ్రూప్-2 పరీక్ష ఉండడం, ఆ టైంలోనే ఎన్నికలు జరిగితే గ్రూప్-3 పరీక్ష నిర్వహణ ఇబ్బందిగా మారవచ్చు. దీంతో జనవరి, ఫిబ్రవరి నెలల్లో గ్రూప్ 1 మెయిన్ నిర్వహించి, ఫిబ్రవరి లేదా
మార్చి నెలల్లో గ్రూప్ 3 ఎగ్జామ్స్ జరిపే అవకాశం ఉంది. ఏది ఏమైనా గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాల తేదీలను బట్టి, మిగిలిన పరీక్షల తేదీపై స్పష్టత వస్తుంది. గ్రూప్-4 రిజల్ట్కు టైమ్ పడుతుంది జనార్దన్ రెడ్డి, గ్రూప్-4 రిజల్ట్కు టైమ్ పడుతుందని టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి చెప్పారు. కమిషన్లో సిబ్బంది తక్కువగా ఉన్నారని తెలిపారు. రాజ్భవన్ ఎట్ హోంలో తనను కలిసిన విలేకరులతో ఆయన చిట్చాట్ చేశారు. టీఎస్పీఎస్సీలో 80 మంది సిబ్బంది ఉండగా.వారిలో 40 మంది లీవ్లోఉన్నారని తెలిపారు. యూపీఎస్సీలో 2వేల మంది ఉంటారని వివరించారు. గ్రూప్-4 8లక్షల మందికి పైగా అభ్యర్థులు రాశారని, వారికి సంబంధించిన 17 లక్ష ల పేపర్లున్నాయని వెల్లడించారు. టీఎస్పీఎస్సీలో చిన్న ఇష్యూ జరిగితే మొత్తం వ్యవస్థను తప్పుపట్టలేమన్నారు.
మరిన్ని వార్తల కోసం...
* ఘనంగా విఠల్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు ఇక్కడ క్లిక్ చేయండి
* డబుల్ బెడ్‌రూం ఇండ్ల పంపిణీ పై కేటీఆర్ సమీక్ష ఇక్కడ క్లిక్ చేయండి
* ఘనంగా స్వాతంత్ర దినోత్సవం వేడుకలు ఇక్కడ క్లిక్ చేయండి
* సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ప్రజా ప్రతినిధులు ఇక్కడ క్లిక్ చేయండి
* ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు పురస్కారం ఇక్కడ క్లిక్ చేయండి
* అసెంబ్లీ ఎన్నికల తర్వాతే గ్రూప్3 ఇక్కడ క్లిక్ చేయండి
* కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్న బషీరాబాద్ అంగన్ వాడి టీచర్ ఇక్కడ క్లిక్ చేయండి