రైలు ఢీకొని 80 గొర్రెలు మృతి,కిష్టప్పకు ఆర్థిక సహాయం
ధారూర్ Dharur News భారత్ ప్రతినిధి : వికారాబాద్ జిల్లా ధారూర్ మండలంలో రైలు ఢీకొని 80 గొర్రెలు మృతి చెందాయి.కురువ కిష్టప్పకు బిఆర్ఎస్ నాయకులు ఆర్థిక సహాయం అందజేశారు.వికారాబాద్ జిల్లా ధారూర్ మండలం దోర్నాల్ గ్రామానికి చెందిన కురువ కిష్టప్ప తన గొర్రెలు మేపుతుండగా సాయంత్రం వేళ గుర్తు తెలియని రైలు ఢీకొని 80 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. ఈ ఘటనతో కుటుంబం అతలాకుతులమైంది. తనకు ఉన్న ఆస్తి గొర్రెలను పోగొట్టుకున్న కిష్టప్ప దిక్కులేని స్థితిలో ఉన్నాడు.
ఈ విషయాన్ని గుర్తించిన జిల్లా కురువ సంఘం చేయూతను అందించేందుకు ముందుకు వచ్చింది. జిల్లా అధ్యక్షులు కోహిర్ శ్రీనివాస్ గొర్రెల కాపరి కురువ కిష్టప్పకు తన వంతు సహాయంగా రూ. 25000/- ఆర్థిక సహాయం కిష్టప్పకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కురుమ సంఘం నాయకులు బోండల శ్రీనివాస్ కురుమ, నర్సింలు కురుమ, జైదుపల్లి గోపాల్ కురుమ, గంగులు కురుమ, యాదయ్య కురుమ, చేవెళ్ల కురుమ సంఘం కార్యదర్శి శ్రీపతి కురుమ, శ్రీనివాస్ కురుమ గార్లు ఉన్నారు కిష్టప్ప కుటుంబాన్ని పెద్ద మనస్సుతో ఆర్థికంగా ఆదుకున్నందుకు కురుమ సంఘం జిల్లా అద్యక్షులు కోహిర్ శ్రీనివాస్ గారిని గ్రామ పెద్దలు నారాయణ్ రెడ్డి గారు శాలువతో సన్మానించడం జరిగింది.