జీవన్గిలో నూతన గ్రామ పంచాయతీ నిర్మాణానికి భూమిపూజ
బషీరాబాద్ Basheerabad News భారత్ ప్రతినిధి : ప్రబుత్వం అందజేసిన 50 లక్షలతో గ్రామని అభివృద్ధి చెందే దిశగా సాగుతున్న సర్పంచులు అధికారులు.నూతన గ్రామపంచాయతీ నిర్మాణానికి భూమిపూజ ఏర్పాటు చేశారు.వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం జీవన్గి గ్రామంలో నూతన గ్రామపంచాయతీ నిర్మాణానికి భూమిపూజ చేసిన సర్పంచ్ నవనీత సుదర్శన్ రెడ్డి. ఈ సందర్భంగా సర్పంచ్ నవనీత రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం గ్రామ పంచాయతీలను అభివృద్ధికి నిధులను మంజూరు చేస్తుందని అన్నారు. అందులో భాగంగా రూ.20 లక్షల తో గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు.అలాగే నూతన ఆస్పత్రి భవన నిర్మాణాని 22 లక్షల నిధులతో పనులను చేపట్టమని అన్నారు. మన ఊరు మన బడి కార్యక్రమంలోని భాగంగా 35 లక్షల నిధులతో పాఠశాల అభివృద్ధి పనులను చేపట్టామని అన్నారు.
మరో ఐదు లక్షల నిధులతో త్వరలోనే చర్చి అభివృద్ధి పనులు చేపడతామని వెల్లడించారు.పలు వార్డులకు విద్యుత్ స్తంభాలు కొరకు కూడా తీర్మానం చేశామని ఆమె తెలిపారు. వర్షా కాలం వచ్చే వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరూ ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆమె అన్నారు. గ్రామంలో ఈగలు, దోమలు, డ్రైనేజీ నుంచి దుర్వాసన రాకుండా ఉండేందుకు బ్లీచింగ్ పౌడర్ చల్లినామన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సునీత, పంచాయతీ రాజ్ శాఖ అధికారులు డీఈ కరుణాకర్ చారి, ఏఈ వంశీ కృష్ణ, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్మాణిక్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పాండురంగ, ఉప సర్పంచ్ జగదీష్, పంచాయతీ కార్య దర్శి ప్రకాశం, పాలకవర్గ సభ్యులు మల్లికార్జున్, నాగే శ్వర్ రావు, దేవేంద్రప్ప, పద్మమ్మ, బిఆర్ఎస్ నాయకులు బసప్ప, నర్సిములు, వెంకటప్ప, బసంత్, రాములు, మహాదేవప్ప,గ్రామస్థులు తదితరులు ఉన్నారు.