Type Here to Get Search Results !

Sports Ad

ప్రజల్ని రక్షించాలి బీఆర్ఎస్ ఎంపీలు డిమాండ్ BRS MPs demand to withdraw the Delhi Bill to protect the people of Manipur


 ప్రజల్ని రక్షించాలి బీఆర్ఎస్ ఎంపీలు డిమాండ్  

జాతీయం National News భారత్ ప్రతినిధి : మణిపూర్ రాష్ట్రాన్ని రక్షించాలి ఢిల్లీ ఆర్డినెన్సును ఉపసంహరించాలి"అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినదించిన బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఆందోళనకు దిగిన బీఆర్ఎస్ ఎంపీలు. రాజ్యసభ సభ్యులు రవిచంద్ర బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు, లోకసభలో బీఆర్ఎస్ పక్ష నాయకులు నాగేశ్వరరావు,సహచర ఎంపీలు సంతోష్ కుమార్, దామోదర్ రావులతో కలిసి ఆందోళనలో అగ్రభాగాన నిలిచారు. అల్లర్లతో అట్టుడికిపోతున్న మణిపూర్ రాష్ట్రాన్ని,అక్కడి ప్రజల్ని రక్షించాలంటూ,ఉద్యోగులపై ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అధికారాలను తగ్గిస్తూ ప్రవేశపెట్టిన బిల్లును వెంటనే ఉపసంహరించాలని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.

ఈ అంశాలపై బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వాన్ని పార్లమెంటులో బీఆర్ఎస్ నిలదీసింది."రక్షించాలి, రక్షించాలి మణిపూర్ రాష్ట్రాన్ని,అక్కడి ప్రజల్ని రక్షించాలి,రక్షించాలి,ఉపసంహరించాలి,ఉపసంహరించాలి ఉద్యోగులపై ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అధికారాలను తగ్గిస్తూ ప్రవేశపెట్టిన బిల్లును ఉపసంహరించాలి, ఉపసంహరించాలి, అంటూ బీఆర్ఎస్ ఎంపీలు ప్లకార్డులు చేతబట్టి ముక్తకంఠంతో నినదించారు.పార్లమెంట్ ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద జరిగిన ఈ ఆందోళనలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే.కేశవరావు,లోకసభలో బీఆర్ఎస్ పక్ష నాయకులు నామా నాగేశ్వరరావు,తన సహచర ఎంపీలు జోగినపల్లి సంతోష్ కుమార్, దీవకొండ దామోదర్ రావు,కే.ఆర్.సురేష్ రెడ్డి,బడుగుల లింగయ్య యాదవ్, రంజిత్ రెడ్డి,పీ.రాములు,మన్నె శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి అగ్రభాగాన నిలిచారు.

మరిన్ని వార్తల కోసం 
* రుణమాఫీ ప్రకటించడంతో...రైతులు సంబరాలు... ఇక్కడ క్లిక్ చేయండి  
* తెలంగాణాలో భూముల రేట్లు పెరిగినయ్ ఇక్కడ క్లిక్ చేయండి  
* కేటాయించిన షెడ్ కిందనే పండ్లు పెట్టుకోవాలి ఇక్కడ క్లిక్ చేయండి  
* జర్నలిస్టులకు ఇండ్ల‌ స్థలాలు ఇస్తాం మంత్రి కేటీఆర్ ఇక్కడ క్లిక్ చేయండి  
* పిల్లలకు పురుగుల మందు తాగించి చంపిన కసాయి తండ్రి ఇక్కడ క్లిక్ చేయండి  
* వరకట్నం వేధింపులకు మహిళ ఆత్మహత్య ఇక్కడ క్లిక్ చేయండి  
* ప్రజల్ని రక్షించాలి బీఆర్ఎస్ ఎంపీలు డిమాండ్ ఇక్కడ క్లిక్ చేయండి   


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies