బిల్లును వెనక్కి తీసుకోవాలంటూ పార్లమెంటు ఆవరణలో నిరసనకు దిగిన బీఆర్ఎస్ ఎంపీలు
తెలంగాణ Telanaga భారత్ ప్రతినిధి : ఢిల్లీ ఉద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అధికారాలను తగ్గిస్తూ ప్రవేశపెట్టిన బిల్లును ఉపసంహరించాలి.బీఆర్ఎస్,ఆప్ ఈ బిల్లును వెనక్కి తీసుకోవాలంటూ పార్లమెంటు ఆవరణలో నిరసనకు దిగిన బీఆర్ఎస్,ఆప్ ఎంపీలు. మణిపూర్ అంశంపై ప్రధాని సభకు వచ్చి బదులివ్వాలంటూ నినాదాలిచ్చిన ఎంపీలు.ఆందోళనలో అగ్రభాగాన నిలిచిన ఎంపీలు రవిచంద్ర, సంతోష్ కుమార్, లింగయ్య యాదవ్,రంజిత్ రెడ్డి, వెంకటేష్, ప్రభాకర్ రెడ్డి ఢిల్లీ ఉద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అధికారాలను తగ్గిస్తూ ప్రవేశపెట్టిన బిల్లును వెంటనే ఉపసంహరించాలని బీఆర్ఎస్,ఆప్ ఎంపీలు డిమాండ్ చేశారు.ఉద్యోగుల బదిలీలు,పదోన్నతులపై కేజ్రీవాల్ ప్రభుత్వానికి ఉండే అధికారాలలో కోతపెడుతూ ప్రవేశపెట్టిన బిల్లును వెనక్కి తీసుకోవాలంటూ బీఆర్ఎస్,ఆప్ ఎంపీలు పార్లమెంటు ఆవరణలో మంగళవారం నిరసనకు దిగారు.
ఈ ఆందోళనలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తన సహచర ఎంపీలు జోగినపల్లి సంతోష్ కుమార్,కే.ఆర్.సురేష్ రెడ్డి,బడుగుల లింగయ్య యాదవ్, రంజిత్ రెడ్డి, బోర్లకుంట వెంకటేష్ నేతకాని, కొత్త ప్రభాకర్ రెడ్డిలతో కలిసి అగ్రభాగాన నిలిచారు.ఢిల్లీ ఉద్యోగుల బదిలీలు, పదోన్నతులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి ఉండే అధికారాలను తగ్గిస్తూ తెస్తున్న నల్ల చట్టాన్ని ఉపసంహరించాలంటూ ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని ముక్తకంఠంతో డిమాండ్ చేశారు.
ఇలాంటి చట్టాలను తెస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నదని బీఆర్ఎస్,ఆప్ ఎంపీలు మండిపడ్డారు.మణిపూర్ రాష్ట్రంలో నెలకొన్న అస్తవ్యస్త పరిస్థితులను చక్కదిద్దేందుకు,శాంతి స్థాపనకు తీసుకున్న,చేపట్టనున్న చర్యల గురించి ప్రధాని నరేంద్రమోడీ సభకు వచ్చి బదులివ్వాలంటూ నినాదాలు చేశారు.ఈ ఆందోళనలో ఆప్ ఎంపీలు రాఘవ్ చద్దా,సంజయ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.