Type Here to Get Search Results !

Sports Ad

రైతు రుణామాఫీ సీఎం కేసీఆర్ గుడ్‌న్యూస్ CM KCR good news for farmers


 రైతులకు రుణామాఫీ సీఎం కేసీఆర్ 

తెలంగాణ Telangana news భారత్ ప్రతినిధి : రైతులకు సీఎం కేసీఆర్ గుడ్‌న్యూస్ వినిపించారు. రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించాలని సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. రైతు రుణమాఫీపై ప్రగతి భవన్‌లో సమీక్షా సమావేశం నిర్వహించిన కేసీఆర్.ఈ కార్యక్రమాన్ని రేపటి నుంచి అంటే ఆగస్టు 3 నుంచి ప్రారంభించి.సెప్టెంబర్ రెండు వారంలోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే అందించిన రుణమాఫీ కాకుండా మరో రూ.19 వేల కోట్ల రుణమాఫీని రైతులకు అందించాల్సుందని కేసీఆర్ పేర్కొన్నారు.తెలంగాణ రైతులకు కేసీఆర్ సర్కార్ గుడ్‌న్యూస్ రేపటి నుంచి రైతు రుణమాఫీ తిరిగి ప్రారంభం. 19 వేల కోట్ల రుణమాఫీ చేయనున్నట్టు కేసీఆర్ స్పష్టం చేశారు.

     తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. రైతుల రుణమాఫీని తిరిగి ప్రారంభించాలని నిర్ణయించి.అన్నదాతలకు గుడ్‌న్యూస్ వినిపించింది. రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని రేపటి నుంచి అంటే ఆగస్టు 3 నుంచి తిరిగి ప్రారంభించాలని సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని రేపటి నుంచి తిరిగి ప్రారంభించాలని మంత్రి హరీశ్ రావుతో పాటు కార్యదర్శి రామకృష్ణారావును సీఎం కేసీఆర్ ఆదేశించారు. 

         రైతుబంధు తరహాలో విడతల వారీగా కొనసాగిస్తూ. నెలపదిహేను రోజుల్లో, సెప్టెంబర్ రెండో వారం వరకు.రైతు రుణ మాఫీ కార్యక్రమాన్ని సంపూర్ణంగా పూర్తిచేయాలని సీఎం కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఇప్పటికే అందించిన రుణమాఫీ పోను మరో 19 వేల కోట్ల రూపాయల రుణమాఫీని రైతులకు అందించాల్సి వుందని సీఎం కేసీఆర్ తెలిపారు. తెలంగాణ రైతాంగ సంక్షేమం వ్యవసాయాభివృద్ధే రాష్ట్ర సర్కారు ప్రధాన లక్ష్యమని కేసీఆర్ పునరుద్ఘాటించారు. ఎన్ని కష్టాలొచ్చినా రైతుల సంక్షేమం కోసం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామని కేసీఆర్ స్పష్టం చేశారు. అయితే కేంద్ర సర్కారు తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం వల్ల ఏర్పడిన మందగమనంతో పాటు కరోనా వల్ల ఏర్పడిన ఆర్థిక సమస్యలు, ఎఫ్ఆర్బీఎం నిధులు విడుదల చేయకపోవటం, తెలంగాణ పట్ల కేంద్రం చూపిన వివక్ష. లాంటి కారణాల వల్ల ఆర్థికలోటుతో ఇన్నాళ్లు కొంత 

           ఆలస్యమైందని కేసీఆర్ చెప్పుకొచ్చారు. అయితే.తిరిగి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చక్కదిద్దుకున్న క్రమంలో.రాష్ట్రంలో రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించాలని కీలక నిర్ణయం తీసుకున్నట్టు కేసీఆర్ తెలిపారు. ఈ విషయంపై ప్రగతిభవన్‌లో బుధవారం రోజున సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి హరీశ్ రావు, ముఖ్య సలహాదారు సోమేశ్ కుమార్, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, హెచ్ఎండీఎ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్ కుమార్, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్ రావు పాల్గొన్నారు.

మరిన్ని వార్తల కోసం 
* రైతులకు రుణామాఫీ సీఎం కేసీఆర్ ఇక్కడ క్లిక్ చేయండి 
* ప్రైవేటు స్కూల్లో ఫీజుల దందా పి.శ్రీనివాస్ ఇక్కడ క్లిక్ చేయండి 
* విద్యార్థులను ఆర్థికంగా ఆదుకున్న ఎమ్మెల్యే ఇక్కడ క్లిక్ చేయండి 
* రైతు రుణమాఫీ చేసిన రైతు బిడ్డ ఇక్కడ క్లిక్ చేయండి 
* తెలుగు రాష్ర్టాల్లో భారీగా పెరుగుతున్న కండ్ల కలక కేసులు ఇక్కడ క్లిక్ చేయండి

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies