జీవన్గి గ్రామంలో ఆణిముత్యం మంజుల రాథోడ్
* ఇష్టంతో చదివితే ఉన్నత శిఖరాలు
* నిరుపేద కుటుంబంలో గిరిపుత్రిక
* వేళ్ళ కట్టలేని సంతోషం గ్రామస్థులు
* మహిళలను చదింవించాలి
బషీరాబాద్ Basheerabad News భారత్ ప్రతినిధి : ఇష్టముతో కష్టపడితే ఏదైన సాధిస్తాం అనడానికి ఆదర్శనంగా నిలబడ్డ గిరిపుత్రిక మంజుల రాథోడ్.వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం జీవన్గి గ్రామానికి చెందిన రాథోడ్ లక్ష్మణ్ సోనీ బై దంపతుల కూతురు మంజుల రాథోడ్ గ్రామంలో జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాలలో పదో తరగతి వరకు చదువుకొని ఇంటర్ డిగ్రీ తాండూర్ సింధు కాలేజీలో ఎంబీఏ హైదరాబాదులో చదువుకొని 2018 సంవత్సరంలో కానిస్టేబుల్ ఉద్యోగాన్ని సంపాదించి ప్రమోషన్తో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తుండెవరు.ఉద్యోగం చేస్తూనే తన యొక్క జీవిత లక్షాన్ని చేరుకుంది.ఇటీవల ఎస్ఐ ఈవెంట్స్ ఫైనల్ పరీక్ష ఆదివారం రోజు ఫలితాల జాబితాలో మంజుల రాథోడ్ అర్హత సాధించడంతో వారి తల్లిదండ్రులు అన్నదమ్ములు గ్రామస్తులు గ్రామ సర్పంచి నవనీత రెడ్డి ఆనందవ్యక్తం చేశారు.
ఈ సందర్భంలో మంజుల రాథోడ్ మాట్లాడుతూ ఎక్కడో మారుమూల ప్రాంతంలో కర్ణాటక దగ్గర ఉన్న మా గ్రామం జీవన్గి నాకు సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ ఎంపికైనందుకు చాలా సంతోషంగా ఉంది.మాది నిరుపేద కుటుంబం దీని వెనుక నాకు మా అమ్మ నాన్న మా అన్నదమ్ములు కష్టపడి నన్ను చదివించారు.పట్టుదలతో చదువుకొని ఈ స్థాయికి రావడానికి కారణం కూడా వారు నాకు చదువు నేర్పిన గురువులు కూడా కారణమే ఈ స్థాయికి రావడానికి వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు గ్రామాలలో ఆడపిల్లలకు చదివి ఎందుకని మధ్యలో చదువు ఆపుతూ ఉంటారు.దయచేసి వారికి కూడా ఉన్నత చదువులు చదివించాలని తల్లిదండ్రులను కోరుకుంటున్నాను.ఇంకా మన గ్రామం మన మండలం నుండి ఉన్నత చదువులు చదువుకొని మంచి ఉద్యోగాలు సాధించాలని తల్లిదండ్రుల పేర్లు నిలబెట్టాలని తెలిపారు.