సివిల్ ఎస్సైగా ఎంపికైన ఉమాదేవిని సన్మానించిన ఎస్సై వేణుగోపాల్ గౌడ్
బషీరాబాద్ Basheerabad News భారత్ ప్రతినిధి : సివిల్ ఎస్సైగా ఎంపికైన గిరిజన బిడ్డ ఉమాదేవి గారిని సన్మానించిన ఎస్ఐ వేణుగోపాల్ గౌడ్.ఎస్ఐ మాట్లాడుతూ ఎస్పై ఫలితాలలో భాగంగా బషీరాబాద్ మండల పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా గత 2 సంవత్సరాల నుండి విధులు నిర్వహిస్తున్న ఉమాదేవి, సివిల్ ఎస్సైగా ఎంపిక కావడం సంతోషకరమని ఎస్పై వేణుగోపాల్ గౌడ్ అన్నారు.ఈ సందర్భంగా ఆయన సోమవారం తమ సిబ్బందితో కలిసి ఆమెను సన్మానించారు.తాండూర్ మండలంలోని బషీర్ మియా తాండాకు చెందిన ఉమాదేవి డిగ్రీ పూర్తి చేసుకుని 2020 సంవత్సరంలో కానిస్టేబుల్ గా ఎంపికై బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తు, గత సంవత్సరం విడుదలైన ఎస్ఐ ఎగ్జామ్ కి సన్నద్ధమై ఎంపిక కావడం సంతోషకరం అని మహిళా కానిస్టేబుల్ గా వృత్తి నిర్వహిస్తూ మళ్లీ పోలీసు డిపార్ట్మెంట్ నందు ఎస్ఐగా ఎంపికై, మహిళలకు అందరికీ ఆదర్శంగా నిలిచిందని అని కొనియాడారు.
నూతన ఎస్సైగా ఎంపికైన ఉమాదేవి మాట్లాడుతూ తను చిన్న ఉన్నప్పుడు నుండి తన చదువును మంతన్ గౌడ్ తండాలోని తమ అమ్మమ్మ వారి ఊరిలో ఏడవ తరగతి వరకు చదువుకోవడం జరిగిందని ఆమె తెలిపారు. నూతన సివిల్ ఎస్ఐగా ఎంపిక అవడం చాలా సంతోషకరమని ఇదే స్ఫూర్తితో ప్రతి ఒక్క గిరిజన యువతులు ఏదైనా తలుచుకుంటే అది సాధ్యమవుతుందని అందుకని ప్రతి ఒక్కరూ ఏదైనా ఉద్యోగం కావాలంటే కష్టపడితే అది సాధ్యమవుతుందని ఆమె తెలిపారు.
మరిన్ని వార్తల కోసం
* సివిల్ ఎస్సైగా ఎంపికైన ఉమాదేవిని సన్మానించిన ఎస్సై వేణుగోపాల్ గౌడ్ ఇక్కడ క్లిక్ చేయండి
* జీవన్గి గ్రామంలో ఆణిముత్యం మంజుల రాథోడ్ ఇక్కడ క్లిక్ చేయండి
* గృహాలక్ష్మి దరఖాస్తు చేసుకోవాలి ఇక్కడ క్లిక్ చేయండి
* ఐఐటీలో మరో యువతి ఆత్మహత్య ఇక్కడ క్లిక్ చేయండి
* గద్దర్ అంత్యక్రియల్లో విషాదం వ్యక్తీ మృతి ఇక్కడ క్లిక్ చేయండి
* టెన్త్ మార్కులతో తపాలా కొలువులు ఇక్కడ క్లిక్ చేయండి