రైతు రుణమాఫీ చేసిన రైతు బిడ్డ
తాండూర్ Tandur News భారత్ ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణములో గురువారం రోజున తాండూరు పట్టణంలో గంజ్ ఆవరణ వద్ద రైతులతో కలిసి బిఆర్ఎస్ నాయకులు కెసిఆర్ గారి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. రైతు రుణమాఫీ ప్రకటనతో యావత్ తెలంగాణ రైతులు హర్షాతిరేఖలు వ్యక్తం చేస్తున్నది ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ కొనసాగించి కరోన వంటి కష్ట కాలం వచ్చినా కేంద్ర ప్రభుత్వం కక్షపూరిత చర్యలవల్ల రుణమాఫీ కొంత ఆలస్యమైనది,కానీ దానికి ప్రత్యమయంగా రైతుల శ్రేయస్సు కోసం గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతుల క్షేమం కోసం. దేశంలో ఎక్కడాలేని విధంగా రైతు బంధు,రైతు భీమా,రైతులకు 24గంటల నాణ్యమైన ఉచిత విద్యత్ అందిస్తూ. రైతులు పండించిన పంటలలు ప్రభుత్వమే కొనుకోలు చేసేవిధంగా. చర్యలు తీసుకుంటూ రైతుల కోసం రైతు క్షేమం కోసం ఎల్లవేలల కృషి చేతున్న రైతు బంధావులు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి రుణపడి ఉండాలని రైతులకు, ప్రజలకు హితవుపలికారు.
అదేవిధంగా అబ్ కీ బార్ కిసాన్ కిసాన్ సర్కార్ అని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజు గౌడ్,మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ దీపా నర్సింలు, పట్టణ అధ్యక్షులు నయీమ్ అప్పు,అధికార ప్రతినిధి వెంకట్ రెడ్డి, ప్రధాన కార్యదర్శులు ఎం.శ్రీనివాస్, సంతోష్ గౌడ్,మున్సిపల్ కౌన్సిలర్స్ విజయ దేవి, సుమిత్ గౌడ్, అస్లం, వెంకన్న గౌడ్, అశ్విని గుండప్ప కో ఆప్షన్ నెంబర్ వెంకట్ రాములు, పట్టణ ఉపాధ్యక్షులు హరిహర గౌడ్, ఉర్దూగర్ చైర్మన్ రజాక్, ఎస్సీ సెల్ అధ్యక్షులు హనుమంతు, బీసీ సెల్ అధ్యక్షులు చిన్నస్వామి రవి, సీనియర్ నాయకులు సలీం, రాజన్ గౌడ్, పలు వార్డు అధ్యక్షులు మరియు సభ్యులు,మైనార్టీ నాయకులు,సోషల్ మీడియా ప్రతినిధులు,మహిళా ప్రతినిధులు, యువ నాయకులు,హామాలి సంఘం సభ్యులు రైతులు తదితరులు పాల్గొన్నారు.