కేటాయించిన షెడ్ కిందనే పండ్లు పెట్టుకోవాలి
తాండూరు Tandur News భారత్ ప్రతినిధి : వికారాబాద్ తాండూరు పట్టణంలో బస్ స్టాండ్ నందు ఉన్నా ఫ్రూట్స్ షాప్స్ రోడ్ మీద ఉండడంతో ట్రాఫిక్ కి ఇరుగ్గా ఉంది.వాళ్లకు కేటాయించిన షెడ్ కిందనే పండ్లు పెట్టి అమ్మాలని చెప్పడంతో ప్రజాలు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గారికి చెప్పగానే,MLA పైలట్ రోహిత్ రెడ్డి గారి అదేశాల మేరకు BRS పట్టణ అధ్యక్షులు నయీం అఫ్ఫు బస్టాండ్ దగ్గర చేరుకొని ప్రజల సమస్య తెలుసుకొని పోలీస్ షాఖ మరియు బస్టాండ్ అధికారులతో మాట్లాడటం జరిగింది.పండ్ల యాజమాన్యంతో షెడ్ లోపల పెట్టి అమ్మడం ప్రజలకు ఇబ్బంది లేకుండా పండ్ల వ్యాపారం చేయాలని తెలియజేశారు. బస్ స్టాండ్ నుండి బ్రిడ్జ్ వరకు ఉన్న డ్రైనేజీ మరియు దుకాణం దగ్గరనే పెట్టుకోవాలె అని నయీం అఫ్ఫు చెప్పగానే పండ్లు యజమని సరే అంటూ ఒప్పుకోవడం జరిగింది.పండ్ల విక్రేతల అభ్యర్థనను అంగీకరించినందుకు నయీమ్ అఫు గారు పోలీస్ డిపార్ట్‌మెంట్ మరియు బస్టాండ్ అథారిటీకి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం పండ్ల విక్రయదారులు ఎమ్మెల్యే గారికి మరియు టౌన్ ప్రెసిడెంట్ నయీం అఫ్ఫు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.