బీసి లబ్ధిదారులకు ప్రభుత్వం చేయూత
బషీరాబాద్ Basheerabad News భారత్ ప్రతినిధి : బీసి లబ్ధిదారులకు ప్రభుత్వం నుండి లక్ష ఆర్థిక సహాయం అందించారు.వికారాబాద్ జిల్లా తాండూర్ జేఎంఎస్ గార్డెన్ లో గురువారం రోజు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి బీసీలకు ప్రభుత్వం ద్వారా ఆర్థిక సహాయం ద్వారా వచ్చిన చెక్కులను అందజేశారు.బషీరాబాద్ మండలం కొర్విచెడ్ గ్రామంనికి చెందిన వడ్డే తిరుపతి,శివ కు మరియు మండలంలో బిసి వర్గాలకు చెందిన లబ్ధిదారులకు సుమారుగా 50 మందికి ప్రభుత్వం ద్వారా ఆర్ధిక సహాయం అందజేశారు.లబ్ధిదారులు మాట్లాడుతూ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి,కెసిఆర్ ముఖ్యమంత్రికి బీసీలు ఆర్థికంగా ఎదగాలనే లక్ష్యంతో లక్ష రూపాయల సహాయం మంజూరు చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.లక్ష రూపాయల ద్వారా స్వయం ఉపాధి ద్వారా ముందుకు వెళ్లి ఆర్థికంగా బాటలో ముందుకు వెళ్తామని సంతోషాన్ని వ్యక్త పరిచారు.