గృహాలక్ష్మి దరఖాస్తు చేసుకోవాలి
తాండూర్ Tandur News భారత్ ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణములో మున్సిపల్ వైస్-చైర్ పర్సన్ పట్లోళ్ల దీప నర్సింలు గారు మాట్లాడుతూ... జాగా ఉన్న వారికి సొంతింటి కల నెరవేర్చనున్న ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం గృహలక్ష్మీ పథకం ద్వారా సొంత ఇంటి సహకారం. సొంత జాగా ఉన్నవారు ఇల్లు నిర్మించుకోవడానికి గృహలక్ష్మి పథకం కింద ఇల్లు మంజూరు చేసి డబ్బులు ఇవ్వడానికి సిద్ధమైన సర్కార్ అర్హులై, ఆసక్తి కలిగిన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది.తాండూరు మున్సిపల్ కి సంబందించిన వారు మున్సిపల్, కార్యాలయాల్లో దరఖాస్తులు చేసుకోవాలని ఆమె తెలిపారు. ముందుగా గృహలక్ష్మీ పథకాన్ని పూర్తిగా ఇల్లు లేని వారు,గిడిసెలు ఉన్న వారు,ఇల్లు ఉండి కూలిపోయిన వారు,ఇళ్ల కప్పు పై పేపర్ (తాడిపత్రి)ఉన్న వారు,అద్దె ఇళ్లలో ఉన్న వారికి మరియు పెద్ద కుటుంబం ఉండి చిన్న ఇల్లు ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. గ్రామాల్లో మరియు మున్సిపల్ లో సంబంధించిన ప్రజా ప్రతినిధులు దగ్గరుండి ప్రజలకు సహకారం అందించాలని మున్సిపల్ వైస్-చైర్ పర్సన్ దీపా నర్సింలు తెలిపారు.
మరిన్ని వార్తల కోసం
* సివిల్ ఎస్సైగా ఎంపికైన ఉమాదేవిని సన్మానించిన ఎస్సై వేణుగోపాల్ గౌడ్ ఇక్కడ క్లిక్ చేయండి
* జీవన్గి గ్రామంలో ఆణిముత్యం మంజుల రాథోడ్ ఇక్కడ క్లిక్ చేయండి
* గృహాలక్ష్మి దరఖాస్తు చేసుకోవాలి ఇక్కడ క్లిక్ చేయండి
* ఐఐటీలో మరో యువతి ఆత్మహత్య ఇక్కడ క్లిక్ చేయండి
* గద్దర్ అంత్యక్రియల్లో విషాదం వ్యక్తీ మృతి ఇక్కడ క్లిక్ చేయండి
* టెన్త్ మార్కులతో తపాలా కొలువులు ఇక్కడ క్లిక్ చేయండి