Type Here to Get Search Results !

Sports Ad

వరద బాధితులను ఆదుకోవాలి, ప్రభుత్వానికి మావోయిస్ట్ లేఖ Help flood victims, Maoist letter to Govt


 వరద బాధితులను ఆదుకోవాలి, ప్రభుత్వానికి మావోయిస్ట్ లేఖ

వరంగల్ Warangal News భారత్ ప్రతినిధి : తెలంగాణ ప్రభుత్వానికి మావోయిస్టు జేఎండబ్ల్యూపీ (JMWP) డివిజన్ కమిటీ లేఖ రాసింది. వరద బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని లేఖలో కోరింది. అత్యంత భారీ వర్షంతో కొండాయి, మోరంచపల్లి జలదిగ్బంధంలో చిక్కుకుని చనిపోయిన వారందరికీ బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఒక్కొక్కరికి ఇల్లు, రూ.10 లక్షల రూపాయులు వెంటనే చెల్లించాలి. వచ్చిన అత్యంత భారీ వర్షంతో ములుగు, భూపాలపల్లి జిల్లాలను అతలాకుతలం చేసింది. భారీ వర్షాలతో వరదలు వచ్చి వాగులు, వంకలు 

      ఉధృతంగా ప్రవహిస్తూ కుంటలు, చెరువులు తెగిపోవడంతో కొండాయి, దొండ్ల, మల్యాల, ప్రాజెక్టు నగర్, బూర్గుపేట, మోరంచపల్లితో సహా చాలా గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో ప్రజలంతా అర్తనాదాలు, అహాకారాలు, అరణ్యరోదనలతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కు బిక్కుమంటూ గడిపారు. కొండాయిలో 8 మంది, మోరంచపల్లిలో నలుగురు, ప్రాజెక్టు నగర్‌లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు, బూర్గుపేటలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురితో సహా లెక్కలోకి రానివారు మరికొందరు వరదలో కొట్టుకుపోయి చనిపోయారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 

     ఎలక్ట్రానిక్ మీడియాలో, ప్రింట్ మీడియాలో ప్రచార ఆర్భాటాలు చేసింది.  కానీ ముందస్తుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా బాధ్యతారహితంగా నిర్లక్ష్యంగా వ్యవహరించింది.భారీ వర్షాలకు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50 వేలు ప్రభుత్వం వెంటనే ఇవ్వాలి.ఈ వరదలతో తెగిన కుంటలను, చెరువులను వెంటనే పునరుద్ధరించాలి. జంపన్న వాగు, మోరంచవాగు, చలివాగు పాటు అనేక వాగులు పక్కన ఉన్న పంట పొలాల్లో వేసిన ఇసుక మేటలను తీయడానికి ప్రభుత్వమే ఎకరాకు రూ.లక్ష వెంటనే ఇవ్వాలి. వరదలకు తెగిన రోడ్లను, వంతెనలను వెంటనే పునరుద్ధరించాలి. వర్షాలతో వాతావరణం కలుషితమై మలేరియాతో పాటు అన్ని రకాల జబ్బులకు వెంటనే మెడికల్ క్యాంపులు పెట్టి వైద్యం అందించాలి. మరో పంట కోసం అన్ని రకాల విత్తనాలను ప్రభుత్వం వెంటనే ఇవ్వాలి.

మరిన్ని వార్తల కోసం 
* తొమ్మిదేళ్లలో సాధించిన ప్రగతి పై, రేపు అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగం ఇక్కడ క్లిక్ చేయండి 
* 18 ఏళ్లు నిండిన వారికి బిగ్‌ అలర్ట్  ఇక్కడ క్లిక్ చేయండి 
* వరద బాధితులను ఆదుకోవాలి, ప్రభుత్వానికి మావోయిస్ట్ లేఖ ఇక్కడ క్లిక్ చేయండి
* స్వామి విగ్రహ ప్రతిష్టాపనకు ఎమ్మెల్యే గారికి ఆహ్వాన పత్రిక ఇక్కడ క్లిక్ చేయండి 
* టీచర్ అర్హతకు టెట్‌ ఇక్కడ క్లిక్ చేయండి 
* వీఆర్​ఏల సర్దుబాటు కోసం కొత్తగా పోస్టులు ఇక్కడ క్లిక్ చేయండి 

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies