స్వామి విగ్రహ ప్రతిష్టాపనకు ఎమ్మెల్యే గారికి ఆహ్వాన పత్రిక
తాండూర్ Tandur News భారత్ ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గంలో అన్ని తానై భక్తి భావం చాటిన గౌరవ ఎమ్మెల్యే శ్రీ పైలెట్ రోహిత్ రెడ్డి.శనివారం రోజున హైదరాబాదులోని ఎమ్మెల్యే గారి స్వగృహంలో ఈ నెల 10, 11, 12 వ తేదీన జరగబోయే ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపనకు మరియు తదితర పూజ కార్యక్రమాలకు ఆహ్వాన పత్రికను అందించిన రాజీవ్ కాలనీ ఇందిరమ్మ కాలనీ వాసులు. ఎమ్మెల్యే గారు తప్పకుండా ఈ నెల జరగబోయే విగ్రహ ప్రతిష్టాపనకు మరియు తదితర పూజా కార్యక్రమాలకు కుటుంబ సమేతంగా విచ్చేస్తానని తెలపడం జరిగింది. కాలనీ వాసులు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకోని మా రాజీవ్ కాలనీ ఆలయ అభివృద్ధి గత పాలకుల నిర్లక్ష్యం వల్ల అభివృద్ధికి నోచుకోలేదు కానీ గౌరవ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారు అడిగిన వెంబడి మా ఆలయానికి కావలసిన ప్రతిదీ అనగా ఆంజనేయ స్వామి విగ్రహాన్నిమరియు కాంపౌండ్ వాల్ ను మరియు ఈ మూడు రోజులు జరగబోయే పూజా కార్యక్రమాలకు సంబంధించిన వేద పండితులను మరియు విచ్చేసి భక్తులకు
అన్నప్రసాదన్ని తానే స్వయంగా ఇవ్వడం ఎంతో సంతోషం, మా కాలనీవాసుల తరఫున ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఇచ్చిన మాటకు కట్టుబడే వ్యక్తిత్వం గల ఇలాంటి మహోన్నతమైన నాయకున్ని మేము ఎక్కడా చూడలేము తాండూరులో మా ఎమ్మెల్యే రూపంలో ఇప్పుడు మేము చూస్తున్నాం. అది మా అందరి సౌభాగ్యం అలాగే ఒక భక్తి భావం కాకుండా తాండూర్ నియోజకవర్గంలో ప్రజలకు ఎలాంటి కష్టమొచ్చినా బాధ కలిగిన అడిగిన వెంబడి తానే స్వయంగా పరిష్కరిస్తాడు.అలాంటి మంచి మనసున్న నాయకుడికి ఆ భగవంతుని కృపాకటాక్షాలు మరియు తాండూర్ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాం. ఆహ్వాన పత్రిక అందించిన వార్డు కౌన్సిలర్ మరియు వార్డు ఇన్చార్జ్ కాలనీవాసులు మరియు ప్రసన్నాంజనేయ స్వామి ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.