విద్యార్థులను ఆర్థికంగా ఆదుకున్న ఎమ్మెల్యే
తాండూర్ Tandur News భారత్ ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణములో గురువారం రోజున విద్యార్థి విభాగం తాండూర్ నియోజకవర్గం కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు బస్సు పాసులు మరియు పౌచులు అందజేశారు.ఈ సంధర్బంగా విద్యార్థి విభాగం సంఘ సభ్యులు మాట్లాడుతూ తాండూర్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారు విద్యార్థుల కోసం పదివేల మంది విద్యార్థులకు తన సొంత డబ్బులు ఐదు లక్షలు రూపాయలు ఆర్టీసీకి ఇచ్చి సంవత్సరానికి కట్టే ఫ్రీ పాస్ యొక్క చార్జీలను విద్యార్థులకు ఆర్థిక భారం కావద్దని ఉద్దేశంతో ఇవ్వడం జరిగిందాని తెలిపారు.మరియు విద్యార్థులకు బస్పాస్ పెట్టుకోవడానికి పౌచులు అందజేస్తున్నారు. దానిలో భాగంగా ప్రభుత్వ స్కూల్ జిజేసి ఉర్దూ మీడియం,తెలుగు మీడియం మరియు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉర్దూ మీడియం విద్యార్థులకు అందిచారని తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమాలలో విద్యార్థి విభాగం సంఘ సభ్యులు,విద్యార్థులు తదితరులు పాల్కొన్నారు.