ప్రైవేటు స్కూల్లో ఫీజుల దందా పి.శ్రీనివాస్
* అధికారుల కనుసైగలోనే నడుస్తున్నాయి
* అనుమతులు రాకుండా అడ్మిషన్ ఎలా ప్రారంభించారు
* త్వరలోనే ఉద్యమ కార్యచరణ ప్రకటిస్తాం
తాండూర్ Tandur News భారత్ ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణములో సెంట్ మర్క్స్ ఇంటర్నేషనల్ స్కూల్ అనుమతి లేకుండా సిబిఎస్ సిలబస్ పేరుమీద ఎలా నడుపుతున్నారు. DEO మరియు స్థానిక MEO ను సస్పెండ్ చేయాలి.తాండూరు పట్టణంలో ఎలాంటి అనుమతులు లేకుండా.నడిపిస్తున్న ప్రైవేట్ స్కూల్లో దందా అధికారుల కనుసైగలోనే నడుస్తున్నాయి. అనుమతులు రాకుండా అడ్మిషన్ ఎలా ప్రారంభించారు ? త్వరలోనే ఉద్యమ కార్యచరణ ప్రకటిస్తాం.
PDSU ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పి శ్రీనివాస్ తాండూరు పట్టణంలో ఎటువంటి అనుమతులు లేకుండా గల్లి గల్లి కి ఇస్తానుసారంగా ప్రైవేటు స్కూల్లో ఫీజుల దందా రోజు రోజుకు పెరిగిపోతుంది. అని PDSU ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలియజేయడం జరిగింది. సెంట్ మార్క్స్ ఇంటర్నేషనల్ స్కూల్ CBSE సిలబస్ పేరుమీద ఎటువంటి అనుమతి లేకుండా గత రెండు సంవత్సరాల నుండి యదేచ్చగా స్కూలు నడుపుతున్నప్పటికీ స్థానిక విద్యాధికారులైన MEO,DEO ఏమాత్రం స్పందించకపోవడం అనుమానాలకు దారితీస్తుందని తెలియజేయడం జరిగింది.
దీనితోపాటు మిగతా స్కూల్లు కూడా ఎటువంటి అనుమతులు లేకుండా గల్లి గల్లికి స్కూల్స్ ఓపెన్ చేసుకొని అడ్మిషన్లు ప్రారంభించి ఫీజుల దందా నడిపిస్తూ ఉంటే జిల్లాలో అసలు విద్యాధికారులు ఉన్నారా? అనే సందేహం వస్తుందని, ఒకవేళ అధికారులు ఉంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ? లేదా విద్యాధికారులు ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలతో కుమ్మక్కయరా ? అనే సందేహం ప్రజల్లో కలుగుతుందని తెలియజేయడం జరిగింది. కావున జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి MEO మరియు DEO గారిని వెంటనే సస్పెండ్ చేయాలని దానితోపాటు అనుమతి లేని స్కూలు నడుపుతున్న యజమాన్యం పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది. లేనియెడల ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (PDSU) ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా నిరాహార దీక్షలు మరియు నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలియజేయడం జరిగింది.