కేసీఆర్ సర్కార్ రైతులకు అండగా
తాండూర్ Tandur News భారత్ ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో సర్కారు పోరాటంతో పాలమూరు-రంగారెడ్డి ఎత్తి పోతలకు అనుమతులు సాధించారు. ఇందోల్ గ్రామంలో సర్పంచ్ రాంచందర్ గారి ఆధ్వర్యంలో ఓగ్లాపూర్ గ్రామ పంచాయతీలో సర్పంచ్ శోభారాణి రాములు మరియు ఎంపీటీసీ గుంనే అంబికా రాజు ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సాధనకు తెలంగాణ సర్కారు ఎన్నో ఒడిదుడుకులను ఎదర్కొందన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో పోరాడి అనుమతులు సాధించకోవడంలో తెలంగాణ వాసుల, దీక్ష, సంకల్పాలు దాగి ఉన్నాయన్నారు.
రెండో దశ పనులు కూడా పూర్తయితే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. తాండూరు నియోజకవర్గంలో 1 లక్ష 30 వేల ఎకరాలకు కృష్ణా జలాలు అందుతాయన్నారు. ఈ పథకంలో భాగంగా పెద్దేముల్ మండలం తట్టిపల్లి వద్ద 1 టీఎంసీ రిజార్వాయుర్ ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ మరియు తాండూర్ శాసనసభ్యులు పైలెట్ రోహిత్ రెడ్డి గారు అన్నారు. త్వరలోనే తాండూరుకు కృష్ణా జలాలతో సాగు నీళ్లు రావడం ఖాయమన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు అనుమతులు పొందడం రైతుల విజయమని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఉప్పరి మహేందర్, సీనియర్ నాయకులు పతంగిపండు, మత్స్య సహకార సంఘం అధ్యక్షులు ఆనంద్, శ్రీనివాస్ రెడ్డి,అన్నా సాగర్ కృష్ణ, బుగ్గాపురం వెంకటేశం, నర్సింలు గౌడ్, లింగంపల్లి అనంతరెడ్డి, అశోక్, రైతులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.