రుణమాఫీ ప్రకటించడంతో...రైతులు సంబరాలు...
బషీరాబాద్ Basheerabad News భారత్ ప్రతినిధి : రైతు రుణ మాఫీ చేసిన రైతు బిడ్డ కేసీఆర్ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర మంత్రివర్యులు కేటీఆర్ గారి పిలుపు మేరకు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారి అదేశాల మేరకు బషీరాబాద్ మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద బిఆర్ఎస్ నాయకులు మండల్ అధ్యక్షులు నర్సిరెడ్డి (రాజు పటేల్) ఆధ్వర్యంలో రైతులు మరియు ప్రజా ప్రతినిధులతో రైతులకు రుణమాఫీ చేసినందుకు సీఎం కేసీఆర్ గారికి ధాన్యవాదాలు తెలుపుతూ సీఎం కేసీఆర్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
ఈ సంధర్బంగా నర్సిరెడ్డి గారు మాట్లాడుతూ నీళ్ళు ఇచ్చి,రైతు బంధు ఇచ్చి,ఉచిత కరెంట్ ఇచ్చి,రుణ మాఫీ ఇచ్చి,రైతు భీమా ఇచ్చి రైతును రాజును చేసిన రైతు పక్షపాతి కేసిఆర్.రుణ మాఫీ ప్రకటించడంతో ప్రతి గ్రామంలో రైతులు సంబరాలు చేసుకుంటున్నరు.రైతు ఆత్మహత్యల తగ్గుదలలో దేశంలోనే 1 స్థానంలో నిలిచింది తెలంగాణ.ఒక్క తెలంగాణ రైతులకే కాదు దేశ రైతులకు భరోసా భారత రాష్ట్ర సమితి భారత రైతు సమితి అని అన్నారు.రైతుని రాజుని చేస్తున్న ఏకైక సర్కార్ మన కేసీఆర్ సర్కార్ కేసీఆర్ సర్కార్ కిసాన్ సర్కార్ అని అన్నారు.నియోజకవర్గ రైతులందరి పక్షాన సీఎం కేసీఆర్ గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బషీరాబాద్ మండల్ పార్టీ అధ్యక్షులు నర్సిరెడ్డి,పిఎసిఎస్ చైర్మన్ వెంకట్రాం రెడ్డి,మాజీ మండల అధ్యక్షులు రాములు నాయక్,సీనియర్ నాయకులు అబ్దుల్ రజాక్ రవీందర్ సింగ్,సాయిల్ గౌడ్,పవన్ టాకూర్,సునీల్ ప్రసాద్ ఏఎంసీ డైరెక్టర్ జగుపంతులు పకీరమ్మ కోటప్ప రాజన్న సిద్దు మరియు రైతులు పార్టీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.