మున్సిపల్ చైర్మన్ కు వినతి పత్రం
* బహుజన్ సమాజ్ పార్టీ తాండూర్ నియోజకవర్గం
* విషయం: ఆధార్ కార్డు సెంటర్ లు పెంచడం గురించి
తాండూర్ Tandur News భారత్ ప్రతినిధి : బహుజన్ సమాజ్ పార్టీ తాండూర్ నియోజకవర్గ కమిటీ తరఫున, ప్రభుత్వం ఇచ్చిన పథకాలకు దరఖాస్తు చేయాలంటే ఆధార్ అనుసందనం తప్పనిసరి, ఏ ప్రభుత్వ పథకా దరఖాస్తు కైనా ఆధార్ తప్పనిసరి, ముఖ్యంగా ఓటర్ ఐడి కార్డు అనుసంధానానికి ప్రభుత్వం గడువు ప్రకటించిన తరుణంలో మన తాండూర్ పట్టణంలో ఒకటి మాత్రమే ఆధార్ కార్డు సెంటర్ ఉంది, కావున ఆధార్ సెంటర్ లను పెంచడానికి తగు చర్యలు తీసుకోవాలని తాండూర్ మున్సిపల్ చైర్మన్ స్వప్న పరిమల్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. పాల్గొన్నవారు తాండూర్ అసెంబ్లీ ఇంచార్జ్ దొరశేట్టి సత్యమూర్తి, నియోజకవర్గ అధ్యక్షులు P. అరుణ్ రాజ్, పెద్దేముల్ మండల అధ్యక్షుడు S. రమేష్, సోషల్ మీడియా కన్వీనర్ జైరామ్ ముత్యాల,పార్టీ నాయకులు ఇషువర్దన్,వినోద్,ధనుష్, తదితరులు పాల్గొన్నారు.