ఘనంగా జరుపుకున్న ప్రొఫెసర్ జయశంకర్ జయంతి
తాండూర్ Tandur News భారత్ ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణములులో ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతిని తాండూర్ లో ఆదివారం రోజున తెలంగాణ ఉద్యమాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఉద్యమకారులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రొఫెసర్ జయశంకర్ కృషివల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారులు బతుకులు ఆగమైనాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ఉద్యమకాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యంగా బీసీ బందు, మైనార్టీ బందు, డబుల్ బెడ్ రూములు, గృహలక్ష్మి నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పించాలని వారు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. గౌరవ ముఖ్యమంత్రి గారు తాండూరు అసెంబ్లీ సీటును మైనార్టీ బీసీ వర్గానికి చెందిన స్థానిక ఉద్యమకారులకు ఎమ్మెల్యేగా అవకాశం కల్పించాలని వారు కేసీఆర్ గారికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఉద్యమకారులు శకుంతల దేశ్పాండే ముజీబ్ ఫెరోస్ ఖాన్ జిలాని కేశవులు వాజిద్ మల్లేష్ పాషా వెంకటయ్య సుదర్శన్ గౌడ్ నబి శ్రీశైలం శ్రీను శాంతప్ప ఇతర ఉద్యమకారులు పాల్గొన్నారు.