బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్ట్
హైదరాబాద్ Hyderabad News భారత్ ప్రతినిధి : జన సమితి చీఫ్, ప్రొఫెసర్ కోదండరామ్‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. టీఎస్పీఎస్సీ నిర్వహిస్తోన్న గ్రూప్- 2 పరీక్షను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం ఇవాళ గన్ పార్క్ వద్ద దీక్షకు పిలుపునిచ్చింది.దీక్ష పిలుపు నేపథ్యంలో ముందుగానే అప్రమత్తమైన పోలీసులు కోదండరామ్‌ను హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన ఇంటివద్ద వద్ద భారీగా పోలీసులను మోహరించారు. పోలీసులు హౌస్ అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఇంటి వద్దనే 10 గంటలకు కోదండరామ్ మౌన దీక్షకు కుర్చోనున్నారు.
మరోవైపు గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ బీఎస్పీ తెలంగాణ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సత్యాగ్రహ దీక్షకు పిలుపునిచ్చారు. దీంతో బీఎస్పీ రాష్ట్ర కార్యాలయం వద్ద భారీగా పోలీసులను మెహరించారు.సత్యాగ్రహ దీక్షకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ను సైతం పోలీసులు ముందస్తుగానే హౌస్ అరెస్ట్ చేశారు.దీంతో ఇంట్లోనే తన దీక్ష కొనసాగిస్తానని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు.