Type Here to Get Search Results !

Sports Ad

మహిళా కు గొడుగుకింద పురుడు పోసిన 108 సిబ్బంది 108 staff members who were under the umbrella of women


 మహిళా కు గొడుగుకింద పురుడు పోసిన 108 సిబ్బంది

అదిలాబాద్ Adilabad News  భారత్ ప్రతినిధి : అదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం దొంగ చింత మండల పరిధిలో పురిటి నొప్పులతో ఉన్న ఆదివాసీ మహిళ ఆసుపత్రికి వెళ్లేందుకు.వర్షంలో, వాగు దాటాల్సిన పరిస్థితి.ఈ క్రమంలో నొప్పులు ఎక్కువ కావడంతో 108 సిబ్బంది వాగు ఒడ్డునే గొడుగు కింద ఆమెకు పురుడు పోశారు.ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూరు మండలం దొంగచింత పంచాయతీ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. చిన్నుగూడకు చెందిన ఆత్రం భీంబాయికి పురిటినొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108కి సమాచారం అందించారు.వెంటనే సిబ్బంది దొంగచింతకు చేరుకొన్నారు. అక్కడి నుంచి చిన్నుగూడకు వెళ్లేందుకు రోడ్డు సౌకర్యం లేదు. దానికితోడు ఆ గ్రామానికి వెళ్లే మార్గంలో రాత్రి నుండి కురిసిన వర్షాలతో  వాగు ప్రవహిస్తోంది.దీంతో 108 సిబ్బంది రెండు కిలోమీటర్లు కాలినడకన వెళ్లి వాగు దాటారు. వాగు ఒడ్డు వరకు వచ్చిన గర్భిణికి నొప్పులు ఎక్కువ కావడంతో స్థానిక మహిళలతో కలిసి సిబ్బంది గొడుగు కిందే పురుడు పోశారు.అనంతరం వారిని జాగ్రత్తగా వాగు దాటించి ఉట్నూరు ప్రభుత్వఆసుపత్రికి తరలించారు. 108 సిబ్బంది ఈఎంటీ శంకర్‌, పైలట్‌ సచిన్‌కు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తల కోసం... 
 * ఎక్మాయ్ గ్రామం లో రాష్ట్ర మంత్రి వర్యులు మహేందర్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు ఇక్కడ క్లిక్ చేయండి
 * తెలంగాణలో 7 ప్రభుత్వ ఆస్పత్రులకు జాతీయ స్థాయి గుర్తింపు ఇక్కడ క్లిక్ చేయండి
 * గ్రూప్ 1 పరీక్ష మళ్లీ రద్దు చేస్తూ హైకోర్టు ఆదేశాలు ఇక్కడ క్లిక్ చేయండి
 * తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు? ఇక్కడ క్లిక్ చేయండి
 * రేషన్ వినియోగదారుల కు ముఖ్యమైన సమాచారం ఇక్కడ క్లిక్ చేయండి
 * గురుకుల పాఠశాలలో అగ్ని ప్రమాదం ఇక్కడ క్లిక్ చేయండి
* మహిళా కు గొడుగుకింద పురుడు పోసిన 108 సిబ్బంది ఇక్కడ క్లిక్ చేయండి


Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies