ఆధార్ ఉచిత అప్దేట్ గడువు పొడిగింపు
హైదరాబాద్ Hyderabad News భారత్ ప్రతినిధి : గతంలో గుర్తింపు కార్డు అంటే ఓటరు గుర్తింపు కార్డు, డ్రైవింగ్ లైసెన్స్,పాన్ కార్డు,కానీ విశ్వజనీన గుర్తింపు కార్డుగా ‘ఆధార్’ నిలిచింది. బ్యాంకు ఖాతా ఓపెన్ చేయాలన్నా.ఉద్యోగంలో చేరాలన్నా.ఏ పని చేయాలన్నా ఇప్పుడు ఆధార్ కీలకం. ప్రతి ఒక్కరి ఆధార్ కార్డులో నంబర్‌తోపాటు బయో మెట్రిక్ అథంటికేషన్ ఉంటుంది. కండ్లకు ఐరిష్ రికగ్నిషన్ ఉంటుంది. అంత ముఖ్యమైన ఆధార్ కార్డులను ప్రతి పదేండ్ల కోసారి అప్డేట్ చేసుకోవాలని విశిష్ట ప్రాధికార సంస్థ (యూఏడీఏఐ) తెలిపింది. ఈ నేపథ్యంలో ఆన్ లైన్‌లో ఆధార్ ఉచితంగా అప్ డేట్ చేసుకునే గడువును మరోమారు పొడిగించింది యూఐడీఏఐ. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ నెల 14తో గడువు ముగియాల్సి ఉంది. కానీ, తాజాగా మరో మూడు నెలల పాటు ఉచితంగా ఆధార్ అప్ డేట్ గడువును పొడిగించింది. ఈ గడువు దాటిన తర్వాత అప్ డేట్ చేసుకోవాల్సి వస్తే మాత్రం ఫీజు పే చేయాల్సి ఉంటుంది.ఆధార్ వివరాల నమోదులో భాగంగా జెండర్ తోపాటు బర్త్ డే, అడ్రస్ తదితర వివరాలు నిర్దేశిత గడువు వరకు ఫ్రీగానే అప్ డేట్ చేసుకోవచ్చు. ఆధార్ తీసుకుని పదేండ్లు దాటిన వారు తమ డెమోగ్రఫిక్ వివరాలు అప్ డేట్ చేసుకోవాలని సూచించింది యూఐడీఏఐ. పదేండ్లుగా అప్ డేట్ చేసుకోని వారు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించింది. అందుకు పౌరులు ఐడెంటిటీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంట్లు అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.ఆధార్ వివరాలు అప్ డేట్ చేసుకునే వారు మై ఆధార్ పోర్టల్ కి వెళ్లి.డాక్యుమెంట్ అప్ డేట్ విభాగంలో పేరు/ జెండర్ / పుట్టిన తేదీ/ చిరునామా ఆప్షన్లలో మీకు అవసరమైన ఆప్షన్ ఎంచుకోవాలి. అటుపై అప్ డేట్ ఆధార్ ఆన్ లైన్ ఆప్షన్ ఎంచుకుని అందుకు అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేస్తే సరి. అటుపు 14 అంకెల అప్ డేట్ రిక్వెస్ట్ నంబర్ వస్తుంది. దీని సాయంతో ఆధార్ అప్ డేట్ స్టేటస్ ఎక్కడ ఉందో చెక్ చేసుకోవచ్చు.