ఆయుర్వేద వన మూలికలు వాటి ఉపయెగలు
ఆరోగ్యం Health : 1.స్వచ్ఛమైన ఇంగువను నిమ్మరసంతో కలిపి నూరి కొద్దిగా వెచ్చచేసి దూదిని దానిలో ముంచి తడిపి పంటి నొప్పి వున్నచోట పెడితే పంటి నొప్పి తగ్గిపోతుంది.
2.బిళ్ళగనే్నరు ఆకుల్ని జామ ఆకుల్ని సమతూకంలో తీసుకుని ముద్దచేసి ఈ ముద్దని ఐదు చెంచాల వంతున ఉదయం సాయంత్రం.
3.రోజులు తీసుకుంటే అతిసార వ్యాధి తగ్గుతుంది.3.వంద గ్రాముల #వాము శుభ్రంచేసి ఎర్రగా వేయించి, మెత్తగా పొడిచేసి డబ్బాలో నిల్వ ఉంచుకొని గ్యాస్‌ట్రబుల్ ఉన్నప్పుడు ఒక చెంచా పొడిని నీళ్ళల్లోగాని, విడిగా గాని తీసుకుంటే ఎక్కువ త్రేన్పులు రాకుండా ఉంటుంది.
4.ముల్లంగిని కూరగా చేసుకుని గానీ, దంచిన రసంగా గానీ తాగాలి. పల్లేరు సమూలంగా కషాయం చేసుకుని తాగితే మూత్ర సంచి సమస్యలు తగ్గుతాయి.
5.మూత్రం కొంచెం కొంచెంగా వస్తే అల్లంముక్కలు తేనెతో గానీ, పంచదారతో గానీ కలుపుకుని తింటే యూనినరీ ఇన్‌ఫెక్షన్స్ తగ్గుతాయి.
6.పచ్చి_మెంతులు ఒక అరచెంచా ఉదయం, సాయంత్రం మింగాలి. పచ్చివి తినలేకపోతే పెరుగులో నానబెట్టుకుని తింటే మూత్ర పిండాల నొప్పి తగ్గుతుంది.
7.నేరేడు_విత్తులు, గింజలు తీసేసిన కాకర కాయలు, నేలతంగేడు పూజ, పొడపత్రి, తిప్పతీగె, ఉసిరికాయ చూర్ణం చేసి రెండు పూటలా నోట్లో వేసుకొని, నీరు తాగితే మధుమేహం నియంత్రణలో ఉంటుంది.
8.మందార_పువ్వుల్ని కొబ్బరి నూనెలో వేసి మరగబెట్టి చల్లార్చి తలకు పెట్టుకుంటే జుట్టు ఊడకుండా ఉంటుంది.
9.గుంటగలగరాకు దంచి, రసం తీసి ఒక వంతు కొబ్బరి నూనెలో కలిపి నీరు మరిగే వరకు ఉడకబెట్టాలి. చిటపట శబ్దం పోయి నూనె పైకి తేలేవరకు పొయ్యిమీద ఉంచాలి. సువాసనకి గంధకచ్చూరాలు కలుపుకుని, వాడడంవల్ల జుట్టు రాలదు. నల్లబడుతుంది. పెరుగుతుంది.వైద్య సలహాలు కోసం లింక్స్
10.చందన_అత్తరు (శాండల్ ఉడ్ ఆయిల్) పది చుక్కలు పంచదారతో కలిపి తింటే మూత్రపు మంట వెంటనే తగ్గిపోతుంది.
11.-అశ్వగంధ_వేర్లు తీసుకుని మెత్తగా నూరి ఒక చెంచా పొడిని అర కప్పు నీళ్ళల్లోగాని, పాలల్లోగాని కలుపుకుని తాగితే నడుం నొప్పి తగ్గుతుంది.అశ్వగంధ ఆకుల్ని ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఒక పచ్చి ఆకుని నమిలి మింగాలి. ఇది బరువును తగ్గిస్తుంది.
12.-ఎర్రమందారంపూలను రెండు గ్లాసుల నీళ్ళలో వేసి ఉడికించి ఒక గ్లాసు నీరు వచ్చేవరకు మరిగించి, వడకట్టి, కషాయం తీసి సీసాలోకి తీసుకుని, రోజూ తలకి పెట్టుకొని రెండు గంటల తర్వాత తల స్నానం చేస్తే పేనుకొరుకుడు తగ్గుతుంది.
13.-బిళ్ళగనే్నరు_ఆకులను, జామ ఆకుల్ని సమానంగా తీసుకుని ముద్దచేసి ఈ ముద్దని ఐదు చెంచాల వంతున ఉదయం సాయంత్రం మూడురోజులు తీసుకుంటే అతిసార వ్యాధి తగ్గుతుంది.
14.-చల్లటి ఒక కప్పు ఆవుపాలు తీసుకుని అందులో ఒక చెక్క నిమ్మరసం కలిపి వెంటనే తీసుకుంటే అర్షమొలలు తగ్గుతాయి.
15.-జిల్లేడు_పువ్వు, పసుపు సమానంగా తీసుకుని నూరి అందులో కొంచెం ఆముదాన్ని వేసి మడమకి రాత్రిపూట కట్టి ఉదయం తీసేస్తే మడమ నొప్పి తగ్గుతుంది.16.-శొంఠి_మిరియాలు సమానంగా తీసుకుని, రెండింటిని దోరగా వేయించి చూర్ణంచేసి పూటకి ఐదు గ్రాములు తేనెతో కలిపి రోజూ మూడు పూటలా 10 రోజుల్లో కీళ్ళ నొప్పులు తగ్గుతాయి.17.-సింహనాద_గుగ్గిళ్ళు అనే టాబ్లెట్లను రోజుకు మూడు చొప్పున మూడునెలలు వాడితే మోకాళ్ళ నొప్పి తగ్గుతుంది.
మరిన్నివార్తల కోసం...
* దళిత బంధు అర్హుల ఎంపికపై హైకోర్టులో పిటిషన్ ఇక్కడ క్లిక్ చేయండి
* ఆయుర్వేద వన మూలికలు వాటి ఉపయెగలు ఇక్కడ క్లిక్ చేయండి
* రక్తసంబంధం మే రక్షాబంధన ఇక్కడ క్లిక్ చేయండి
* తాండూరు ఎమ్మెల్యే గారిని కలిసిన స్టోన్ మర్చంట్ అసోసియేషన్ సభ్యులు ఇక్కడ క్లిక్ చేయండి
* తెలంగాణ వీఓఏలకు గుడ్‌న్యూస్ ఇక్కడ క్లిక్ చేయండి
* ఒక దేశం-ఒకేసారి ఎన్నికలు' కోసం కేంద్రం మరో ముందడుగు ఇక్కడ క్లిక్ చేయండి
* కమిటీ కో కన్వీనర్ గా బాధ్యతలు స్వీకరించిన రమేష్ ఇక్కడ క్లిక్ చేయండి