బహుజన రాజ్యమే అంతిమ లక్ష్యం
తాండూర్ Tandur News భారత్ ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గ కమిటీ ఈరోజు ఉదయం బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ బోయినీ చంద్రశేఖర్ ముదిరాజ్ గారు యాలల్ మండలం గోరేపల్లి గ్రామంలో గడపగడపకు ఏనుగు గుర్తు ప్రచారం చేయడం జరిగింది. అయితే అందులో భాగంగానే తాండూర్ లో నీలి జెండా ఎగర వేసే సమయం వచ్చిందని, ప్రతి ఒక్కరూ బహుజన రాజ్య స్థాపనలో అడుగులు వేయాలని, బహుజన రాజ్యం వస్తే మన బ్రతుకులు మారుతాయి తప్ప ఈ దోపిడి దొరల రాజ్యాల్లో మన బ్రతుకులు మారవు కావున, ప్రతి ఒక్కరు ఏనుగు గుర్తుకు ఓటు వేసి తాండూర్ లో బిఎస్పిని గెలిపించాలని చంద్రశేఖర్ ముదిరాజ్ గారు ప్రజలను కోరడం జరిగింది.ఇందులో పాల్గొన్నవారు బీఎస్పీ తాండూర్ అసెంబ్లీ ఇన్చార్జ్ దొరశెట్టి సత్యమూర్తి తాండూర్ నియోజకవర్గ అధ్యక్షులు P.అరుణ్ రాజ్ అదేవిధంగా బీఎస్పీ గ్రామ నాయకులు, మండల నాయకులు, నియోజకవర్గ నాయకులు, పాల్గొన్నారు. ఇట్లు బహుజన సమాజ్ పార్టీ తాండూర్ నియోజకవర్గ కమిటీ