ఎమ్మెల్యే గారి పిలుపు మేరకు రంగారెడ్డి ఎత్తిపోతలు ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి బయలుదేరిన బిఆర్ఎస్ నాయకులు
తాండూర్ Tandur News భారత్ ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూర్ రూరల్ ఈరోజు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు ప్రాజెక్ట్ ట్రాయల్ రన్ ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ గారి మీటింగ్ కు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గారి పిలుపు మేరకు నగర్ కర్నూల్ కు తాండూర్ మండలం నుంచి బి.ఆర్.ఎస్ శ్రేణులు బయలుదేరారు. ఈ సందర్భంగా జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించిన మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఉమా శంకర్ మరియు రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు రామలింగ రెడ్డి,ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎంపీటీసిల పోరం అద్యక్షుడు నరేందర్ రెడ్డి (సాయి రెడ్డి)ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు రావడం ద్వారా వెనుకబడిన తాండూర్ ప్రాంతానికి ఎంతో లబ్ధి చేకూరుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తాండూర్ సర్పంచ్ ల సంగం అధ్యక్షుడు రాములు, మాజీ ఎంపిటిసి రఘునాథ్ రెడ్డి.సర్పంచ్ లు, ఎంపీటీసీలు, ఉప సర్పంచ్ లు, పార్టీ అనుబంధ సంఘాలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.