తాండూరులో బీఆర్ఎస్ పార్టీ చేరికల ప్రభంజనం BRS party joins in Tandoor
Bharath NewsSeptember 21, 2023
0
తాండూరులో బీఆర్ఎస్ పార్టీ చేరికల ప్రభంజనం
* బీజేపీ నుంచి భారీగా బీఆర్ఎస్ పార్టీలోకి వలసలు * గౌరవ ఎమ్మెల్యే శ్రీ పైలెట్ రోహిత్ రెడ్డి గారి సమక్షంలో చేరికలు
తాండూర్ Tandur News భారత్ ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో గౌరవ ఎమ్మెల్యే శ్రీ పైలెట్ రోహిత్ రెడ్డి గారి సమక్షంలో బీఆర్‌ఎస్‌లోకి చేరికల పర్వం కొనసాగుతోంది. సీఎం కేసీఆర్ నేతృత్వంలో తాండూరులో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఇతర పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు వచ్చి గులాబీ కండువాలు కప్పుకుంటున్నారని ఎమ్మెల్యే గారు తెలిపారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారి సమక్షంలో బషీరాబాద్ మండలం, బహదూర్‌పూర్ యువనేత శ్రీకాంత్ అధ్వర్యంలో బీజేపీ నుంచి దాదాపు 100 మంది యువకులను పార్టీలో చేరారు.వాళ్లందరికీ గౌరవ ఎమ్మెల్యే శ్రీ పైలెట్ రోహిత్ రెడ్డి గారు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సాయి సంపత్, కావలి నరోత్తమ్, మెట్టు హనుమంతు, నవీన్, ప్రభాకర్, దేవర శ్రీనివాస్, ప్రదీప్, మహేష్, నవీన్, విక్రమ్ తో పాటు పలువురు యువకులు పార్టీలో చేరారు.