Type Here to Get Search Results !

Sports Ad

ఉపవాసం చేయడం వలన వివిధ అవయవాలలో కలుగు మార్పులు Changes in various organs due to fasting


 ఉపవాసం చేయడం వలన వివిధ అవయవాలలో కలుగు మార్పులు 

ఆరోగ్యం Health : 1. జీర్ణక్రియ జీర్ణావయవాలకు మంచి విశ్రాంతి లభించును . అజీర్ణము తొలగించి ఆకలి వృద్ది అగును.

2. మలాశయం మలాశయంలోని మురికి బహిష్కరించబడి అజీర్ణం తొలగును . క్రిములను , బ్యాక్టీరియాలను నాశనం చేయును . 

3. మూత్రపిండములు మూత్రపిండములలోని విషపదార్ధములు , రాళ్లు బయటకి వెడలును . 

4. ఊపిరితిత్తులు ఉపిరితిత్తులోని నంజు , నీరు బహిష్కరించబడి ఆయాసము నివారించును . శ్వాసక్రియ చక్కగా జరుగును . 

5. గుండె గుండె చుట్టు , లోపల చేరిన కొవ్వు , నీరు తగ్గి గుండె చక్కగా కొట్టుకొనును . అధికంగా తినడం వలన రక్తంలో కొలెస్టరాల్ ఎక్కువ అయ్యి గుండెజబ్బులు వచ్చును 6. లివర్ , స్ప్లీన్ ఆహారం జీర్ణం అగుటకు ఇవి ముఖ్యముగా పనిచేయవలెను . ఉపవాసం చేయుట వలన వీటికి విశ్రాంతి దొరుకును . వాటిలో మాలిన్యాలు తొలగించబడి జీర్ణక్రియ వృద్ధిచెందును . 

7. రక్తప్రసరణ రక్తదోషములు నివారణ జరుగును. ఉపవాసం వలన రక్తప్రసారం చురుకుగా జరుగును. కావున తిమ్మిర్లు , మంటలు , నొప్పులు నివారణ అగును. 

8. కీళ్లు కీళ్లలో పేరుకుపోయిన కొవ్వు , నీరు , మాంసం , ఇతర మాలిన్యాలు తొలగించబడి వ్యాధి నివారణ అగును. 

9. నాడి మండలము ఉపవాసం వలన నాడీ మండలం శుద్ది జరిగి వ్యాధి నివారణ జరుగును. 

10. జ్ఞానేంద్రియములు జ్ఞానేంద్రియాలలోని మాలిన్యములు కూడా నివారణ అగును. 

11. చర్మము చర్మము కాంతివంతం అగును. చర్మవ్యాధులు హరించును . శరీరానికి చక్కని రంగు వచ్చును . 

12. మనస్సు మనస్సు నిర్మలం అగును. కోపతాపములు నివారించును . ఆధ్యాత్మిక చింతనకు పునాదులు ఏర్పడును . 

పైన చెప్పినవే కాకుండా మరెన్నో ఉపయోగాలు ఉన్నాయి . దురభ్యాసాలను విడుచుటకు ఉపవాసం మిక్కిలి ఉపయోగపడును. ఉపవాసం అనగా ఆహారం తీసుకోకపోవడం ఉపవాసం కాదు. ఉపవాసానికి కూడా కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. వాటి గురించి తరవాతి పోస్టులలో వివరిస్తాను.

మరిన్ని వార్తల కోసం... 
* రెట్రో వాకింగ్​తో బరువు తగ్గొచ్చు.. మోకాళ్ల నొప్పులు తగ్గించుకోవచ్చు ఇక్కడ క్లిక్ చేయండి
* ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటున్న ఎమ్మెల్యే ఇక్కడ క్లిక్ చేయండి
* ఉపవాసం చేయడం వలన వివిధ అవయవాలలో కలుగు మార్పులు ఇక్కడ క్లిక్ చేయండి 
* దేశం పేరు ఇక 'భారత్‌'? తీర్మానం చేసే యోచనలో కేంద్రం.. ఇక్కడ క్లిక్ చేయండి
* రుణమాఫీ అయిన రైతులకు కొత్త రుణాలు ఇవ్వాలి మంత్రి హరీష్ రావు కీలక ఆదేశాలు ఇక్కడ క్లిక్ చేయండి

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies