వాట్సప్‌లోనూ ఛానల్స్
Technology News భారత్ ప్రతినిధి : ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ కొత్తగా ఛానల్స్ సదుపాయాన్ని తీసుకొచ్చింది. భారత్ సహా 150 దేశాల్లో ఈ ఫీచర్‌ను ప్రారంభించినట్లు వాట్సప్ మాతృసంస్థ మెటా తెలిపింది. ఇప్పటికే చాలా మందికి ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. త్వరలో మిగిలిన వారికీ రానుంది.
వాట్సప్ ఛానల్ అంటే?
ఇన్నాళ్లూ వాట్సప్‌ను పరస్పర సమాచార మార్పిడి(కమ్యూనికేషన్)కి మాత్రమే వాడేవాళ్లం. ఆ తర్వాత గ్రూప్స్ వచ్చాయి. ఇప్పుడు కొత్తగా ఛానల్స్ అందుబాటులోకి వచ్చాయి. ఈ ఫీచర్ ద్వారా మీకు నచ్చిన వ్యక్తులు, సంస్థలను అనుసరిస్తూ వాట్సప్‌లోనే ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ తెలుసుకోవచ్చు. అచ్చం ట్విటర్, ఇన్‌స్టాలో ఎలాగైతే మనకు నచ్చిన వారిని అనుసరిస్తున్నామో(ఫాలో అవుతున్నామో) అలా అన్నమాట. కావాలనుకుంటే ఈ అప్‌డేట్‌ను ఇతరులతో పంచుకోవచ్చు.వాట్సప్‌లో మీకు ఛానల్స్ సదుపాయం అందుబాటులోకి వచ్చి ఉంటే స్టేటస్ ట్యాబ్ స్థానంలో అప్‌డేట్స్ అని కనిపిస్తుంది. అక్కడ పై భాగంలో స్టేటస్‌లు కనిపిస్తాయి. దిగువన ఛానల్స్ కనిపిస్తాయి. వాటిని అనుసరించొచ్చు. అక్కడే ఉన్న ప్లస్ గుర్తును నొక్కడం ద్వారా మనకు నచ్చిన ఛానల్స్‌ను వెతుక్కోవచ్చు.మోదీ ప్రవేశం వాట్సప్ తీసుకువచ్చిన ఛానల్స్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేరారు. దీంతో ప్రధానికి సంబంధించిన సమాచారన్నంతా వాట్సప్ వినియోగదారులు సులభంగా తెలుసుకునే అవకాశం కలుగుతుంది.