రైతాంగానికి సీఎం కేసీఆర్ పెద్ద పీట- ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారు
కోట్‌పల్లి Kotpally భారత్ ప్రతినిధి : దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రైతాంగానికి పెద్దపీట వేస్తున్నారని తాండూరు ఎమ్మెల్యే శ్రీ పైలెట్ రోహిత్ రెడ్డి గారు అన్నారు. గురువారం తాండూరు నియోజకవర్గంలొని కోట్‌పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం పదవీ ప్రమాణస్వీకారోత్సవంలో మంత్రి వర్యులు పట్నం మహేందర్ రెడ్డి గారు, వికారాబాద్ ఎమ్మెల్యే శ్రీ మెతుకు ఆనంద్ గారు, వికారాబాద్ జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మైన్ రాజు గౌడ్ గారితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారు.. రైతులను కుటుంబ సభ్యులుగా భావించిన సీఎం కేసీఆర్ గారు.రైతుబంధు, రైతుభీమా, రైతు వేదికలు, రుణమాఫీ లాంటీ పథకాలు ప్రవేశపెట్టి దేశానికే ఆదర్శంగా నిలిచారన్నారు. ఇలాగే రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా.ఈ పథకాలు ఇలాగే కొనసాగాలన్నా.రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఓటేసి సత్తా చాటాలని తెలిపారు. ఈ సందర్భంగా కోట్‌పల్లి వ్యవసాయ మార్కెట్ చైర్మైన్, వైస్ చైర్మైన్, డైరెక్టర్లకు శుభాకాంక్షలు తెలియజేశారు.