మీ మొబైల్‌కి ఎమర్జెన్సీ మెసేజ్ వచ్చుంటుంది కంగారు పడొద్దు
జాతీయ National News భారత్ ప్రతినిధి : ఇదీ అసలు విషయ దేశ వ్యాప్తంగా మొబైల్ స్క్రీన్ లపై ఎమర్జెన్సీ అలెర్ట్ వచ్చింది. దీంతో చాలా మంది ఉలిక్కిపడి, భయాందోళనలకు గురయ్యారు.టెలి కమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ పాన్ ఇండియా ఎమర్జెన్సీ మొబైల్ అలర్ట్ ని ప్రయోగాత్మకంగా నిర్వహించింది. దీంతో మనకు మొబైల్ స్రీన్లపై ఎమర్జెన్సీ వార్నింగ్ మెసేజ్ డిస్ప్లే అయింది.నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అనుబంధంతో ఈ టెస్టింగ్ జరిగింది. భవిష్యత్తులో ప్రకృతి విపత్తుల నుండి ప్రజల్ని అలర్ట్ చేయడానికి ట్రయల్ టెస్ట్ నిర్వహించారు.