Type Here to Get Search Results !

Sports Ad

సూర్యుడిపై భారత్‌ ప్రయోగాలకు తొలి అడుగు First step of India's experiments on the Sun

 

సూర్యుడిపై భారత్‌ ప్రయోగాలకు తొలి అడుగు

టెక్నాలజీ Technology : భారత్ ప్రతినిధి : ఇస్రో చేపట్టిన ఆదిత్య ఎల్‌1 ప్రయోగం ఉదయం 11.50 గంటలకు నింగిలోకి దూసుకెళ్లింది. శ్రీహరికోటలోని షార్‌ నుంచి పీఎస్‌ఎల్వీ సీ-57 ద్వారా ఆదిత్య ఎల్‌-1 ప్రయోగం చేపట్టారు.రూ. 378 కోట్లతో ప్రయోగించిన ఈ మిషన్‌.. నాలుగు నెలలపాటు ప్రయాణించి దాదాపు 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాంగ్రేజ్‌ పాయింట్‌ (ఎల్‌ 1) వద్దకు చేరుకోనుంది. రాకెట్‌ వివరాలు  పీఎస్‌ఎల్‌వీ సీ57 రాకెట్‌ పొడవు 44.4 మీటర్లు. రాకెట్‌ ప్రయోగ సమయంలో 321 టన్నుల బరువుంటుంది. నింగికి పయనమైన 01-03-31 (3799.52) నిమిషాల్లో ప్రయోగం పూర్తవుతుంది. మొదటి దశలో 139 టన్నుల ఘన ఇంధనం కోర్‌ అలోన్‌ దశ, ఈ ప్రయోగానికి రాకెట్‌ చుట్టూరా ఆరు స్ట్రాపాన్‌ బూస్టర్లు ఉంటాయి. ఒక్కో బూస్టర్‌లో 12.2 టన్నుల ఘన ఇంధనం నింపుతారు. 212.02 టన్నుల ఘన ఇంధనంతో మొదటి దశ 109.40 సెకన్లలో పూర్తవుతుంది. 41 టన్నుల ద్రవ ఇంధనాన్ని వినియోగించి 262.38 సెకన్లకు రెండోదశ పూర్తవుతుంది. 7.65 టన్నుల ఘన ఇంధనం సాయంతో 581.42 సెకన్లకు మూడో దశను పూర్తిచేస్తారు. మళ్లీ నాలుగోదశ (పీఎస్‌-4) 3127.52 సెకన్లకు స్టార్ట్‌ చేసి 3599.52 సెకన్లకు కటాఫ్‌ చేస్తారు.శిఖరభాగాన అమర్చిన ఆదిత్య-ఎల్‌1 ఉపగ్రహాన్ని 3799.52 సెకన్లకు (01.03.31 గంటల వ్యవధి)లో భూమికి దగ్గరగా (పెరిజి) 235 కిలోమీటర్లు, భూమికి దూరంగా (అపోజి) 19,500 కిలోమీటర్ల ఎత్తులోని ఎసింట్రక్‌ ఎర్త్‌ బౌండ్‌ ఆర్బిట్‌లోకి ప్రవేశపెడతారు. 175 రోజుల తరువాత సూర్యుడి సమీపంలోని లాంగ్రేజియన్‌ బిందువు-1 వద్ద ప్రవేశపెట్టి సూర్యుడిపై అధ్యయనం చేస్తారు.

మరిన్ని వార్తల కోసం... 
* మెడికల్ అండ్ జనరల్ స్టోర్ ని ప్రారంభించిన సీనియర్ నాయకులు గౌరవ విట్టల్ రెడ్డి గారు ఇక్కడ క్లిక్ చేయండి
* రోహితన్న మహిళా చేయూత కార్యక్రమం ఇక్కడ క్లిక్ చేయండి
* మంత్రివర్యులు, ఎమ్మెల్యే, ఎంపీలకు తాండూర్ ప్రజల ఘన సన్మానం ఇక్కడ క్లిక్ చేయండి
* తాండూర్ పట్టణంలో జరగబోయే ర్యాలీ కార్యక్రమాన్ని దిగ్విజయం చేద్దాం ఇక్కడ క్లిక్ చేయండి
* చెమటకాయలు తీసుకోవలసిన జాగ్రత్తలు ఇక్కడ క్లిక్ చేయండి
* మధుమేహం షుగర్ సైడ్ ఎఫెక్ట్స్ నివారించే దివ్య ఔషదం ఇక్కడ క్లిక్ చేయండి
* సూర్యుడిపై భారత్‌ ప్రయోగాలకు తొలి అడుగు ఇక్కడ క్లిక్ చేయండి

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies