నిమ్స్ లో గుండెకు ఉచిత శస్త్రచికిత్సలు
* ఈ నెల 24 నుంచి 30వ తేదీ వరకు
* 'చార్లెస్ హార్ట్ హీరోస్ క్యాంపు' పేరుతో బ్రిటన్ పీడియాట్రిక్ వైద్యులు
* మరిన్ని వివరాలకు 040-23489025
హైదరాబాద్ Hyderabad News భారత్ ప్రతినిధి : చిన్నారులకు హృదయ సంబంధ వ్యాధులుంటే తల్లిదండ్రులు పడే బాధ వర్ణ నాతీతం. రూ.లక్షలు వెచ్చించి ప్రైవేటు ఆసుపత్రుల చుట్టూ తిరిగే స్తోమత చాలామందికి ఉండదు. అలాంటి వారికి నిమ్స్ లో ఈ నెల 24 నుంచి 30వ తేదీ వరకు గుండె శస్త్రచికిత్సలు ఉచితంగా చేయను న్నారు.దీని కోసం బ్రిటన్ వైద్యులు, నిలోఫర్, నిమ్స్, ఓ బృందంగా ఏర్పడినట్లు ఆదివారం ఆసుపత్రి డైరె క్టర్ నగరి బీరప్ప ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 'చార్లెస్ హార్ట్ హీరోస్ క్యాంపు' పేరుతో బ్రిటన్ పీడియాట్రిక్ వైద్యులు డాక్టర్ దన్నపునేని రమణ ఆధ్వర్యంలో పది మంది వైద్యులు ఇక్కడికి రానున్నారు.
అప్పుడే పుట్టిన చిన్నారుల నుంచి అయిదేళ్ల వయసు వారికి పుట్టుకతో, జన్యుపరంగా వచ్చే గుండె సమస్యలకు శాశ్వత పరి ష్కారం చూపనున్నారు పైసా ఖర్చు లేకుండా ఆరో గ్యశ్రీ, సీఎం సహాయనిధితో నిర్వహించనున్నారు. గత ఏడాది కూడా వారంపాటు చికిత్సలు నిర్వహించి 9 మంది చిన్నారులకు ప్రాణం పోశారు. నెలన్నర వయ సున్న ఓ చిన్నారికి తొలిసారిగా ఎక్మో యంత్రంతో వైద్యం అందించి కాపాడారు. తాజాగా ఆసుపత్రి కార్డియో థొరాసిక్ విభాగాధిపతి డాక్టర్ అమరేశ్వర రావు నేతృత్యంలో రోజూ 2-3 శస్త్రచికిత్సలు చేయను న్నారు.ఇతర వివరాలకు 040-23489025 ఫోన్ నంబరుకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలలోపు సంప్రదించి తెలుసుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం
* నా చావుకు కారణం నా పెళ్ళాం ఇక్కడ క్లిక్ చేయండి
* మహిళల భద్రతకోసం "షీ టీం"కొత్త ఫోన్ నెంబర్లు ఇక్కడ క్లిక్ చేయండి
* ఇంట్లోనే బరువు తగ్గడానికి కొన్ని చిట్కాలు ఇక్కడ క్లిక్ చేయండి
* టెట్ హాల్‌టికెట్లు ఈ నెల 15న పరీక్ష ఇక్కడ క్లిక్ చేయండి