దేశానికి కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ : టిపిసిసి జనరల్ సెక్రెటరీ ఎడవల్లి కృష్ణ
* నేటికీ సంవత్సరం అవుతున్న భారత్ జోడోయాత్ర:ఎడవల్లి కృష్ణ
* పోస్టాఫీస్ సెంటర్ నుండి బస్టాండ్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించిన:ఎడవల్లి
* కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు భారత్ జొడోయాత్ర చేసి చరిత్ర సృష్టించిన నాయకుడు రాహుల్
కొత్తగూడెం Kothagudem News భారత్ ప్రతినిధి : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం పట్టణ పరిధి ఏఐసిసి పిసిసి ఆదేశాల మేరకు బస్టాండ్ సెంటర్ అమరవీరుల స్థూపం నుండి పోస్టాఫీసు అంబేత్కర్ సెంటర్ వరకు భారత్ జోడోయాత్ర నేటికీ సంవత్సరం అవుతున్న సందర్భంగా వేడుకల్లో భాగంగా టిపిసిసి జనరల్ సెక్రెటరీ ఎడవల్లి కృష్ణ అధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఇట్టి కార్యక్రమములో సీనియర్ కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు,ఇట్టి కార్యక్రమములో ఎడవల్లి కృష్ణ ముందుగా అమరవీరుల స్థూపం వద్ద నివళులర్పించారు. అనంతరం ర్యాలీ నిర్వహించి పోస్టాఫీసు సెంటర్ వరకు వెళ్లి అంబేత్కర్ విగ్రహం కి పూలమాల వేసి అనంతరం ఎడవల్లి మాట్లాడుతూ దేశానికి కాబోయే ప్రధాని మన ప్రియతమా నాయకులు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు విజయవంతంగా ముగిసింది. ఇట్టి యాత్రలో రాహుల్ ఇప్పుడు ఉన్న బి.జే.పి,బి.అర్.యస్ ప్రభుత్వాలు ప్రజలను ఏవిధంగా ఇబ్బంది పెడుతున్నాయో దగ్గర నుండి చూశారు. నుటముప్పై అయిదు రోజులు సాగిన పాదయాత్రలో రాహుల్ నాలుగువేల ఏనబై ఒకటి కిలోమీటర్ల నడిచారు,పన్నెండు రాష్ట్రలు,డెభైఅయిదు జిల్లాలు, డెభైఅరు లోక్ సభ స్థానాల్లో,రెండు కేంద్రపాలిత ప్రాంతాలలో, పాదయాత్ర నిర్వహించారు
కులమతాలకు అతీతంగా సాగిన యాత్రలో కొన్ని కోట్ల మంది ప్రజానీకాన్ని కలిశారు,వారు పడుతున్న బాధలు ఇబ్బందులు కోసం అడిగి తెలుసుకున్నారు,ఏ జిల్లాకి వెళ్లిన ప్రజలు రాహుల్ కి బ్రమ్మ రథం పట్టరని,కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే మా బాధలు కష్టాలు తోలుగుతాయని ప్రజలు రాహుల్ కి వారి గోడువెళ్లబోసుకున్నారు. ప్రజలకు భరోసా ఇస్తూ,వారి గుండెల్లో దైర్యం నింపుతూ ముందుకు సాగారు,రాహుల్ భారత్ జోడోయాత్ర దేశంలో ఒక చరిత్ర సృష్టించింది,దేశ ప్రజలందరూ కూడా సమానం అనే దృడసంకల్పంతో యాత్ర కొనసాగించారు.మోదీ,కే.సి.అర్ మరి కొంత మంది నాయకుల రాహుల్ పాదయాత్ర చూసి గుండెల్లో రైళ్లు పరుగెత్తించిన ఘనత రాహుల్ కే దక్కింది,రాహుల్ యాత్ర వల్ల దేశంలో కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తల్లో కొత్త జోష్ నింపిందని,దేశంలో రాబోయే ప్రభుత్వం కాంగ్రెస్,ఎవరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు పన్నినా అఖండ మెజారిటీతో కాంగ్రెస్ గెలుపు తధ్యం ఈ కార్యక్రమములో సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాయల శాంతయ్యా,కొత్తగూడెం పట్టణ అధ్యక్షులు బొమ్మిడి మల్లికార్జున్,పాల్వంచ పట్టణ అధ్యక్షులు నూకల రంగారావు,చుంచుపల్లి మండల అధ్యక్షులు అంతోటి పాల్,పట్టణ బీసీ సెల్ అద్యక్షులు పల్లపు వెంకటేశ్వర్లు,INTUC జిల్లా నాయకులు జెలిల్,చుంచుపల్లి బీసీ సెల్ అద్యక్షులు సిరంగి శ్రీనివాస్,పట్టణ యస్సీ సెల్ అధ్యక్షులు కళ్ళేపల్లి రాజు,లక్ష్మీదేవిపల్లి యస్సీ సెల్ అధ్యక్షులు కొప్పుల రమేష్,దన్బాద్ సునీల్,మైనార్టీ పట్టణ అధ్యక్షురాలు జరిన,మైనార్టీ నాయకులు అక్బర్,చుంచుపల్లి మండల యస్సీ సెల్ అధ్యక్షులు శనగ లక్ష్మణ్,బీసీ సెల్ నాయకులు పాంచాల నాగభూషణం,జక్కుల శ్రీనివాస్,పాల్వంచ పట్టణ మైనార్టీ నాయకులు చంద్ పాషా,పాల్వంచ పట్టణ బీసీ సెల్ అద్యక్షులు చారి,సీనియర్ నాయకులు సుబ్బా రెడ్డి,పాల్వంచ మండల నాయకులు కట్ట సోమయ్య,సారంగా ఫణి,మన్నే శ్రీను,బత్తుల వెంకటేశ్వరరావు,నియోజకవర్గ మైనార్టీ జనరల్ సెక్రెటరీ గులాం మతిన్,రాజ శేఖర్,కుషాల్,మన్ సింగ్,నాగేంద్ర నాయుడు,గద్దిగుట్ట నరేష్,పవన్,ఆదర్ష్,లోగానీ మురళి,అంతోటి రాజు,రఘు నాథ్, సాయి,భాను,ఫైజుద్దిన్,కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు,అభిమానులు భారీగా పాల్గొన్నారు.