Type Here to Get Search Results !

Sports Ad

చెప్పుల్లేకుండా నడవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు Health Benefits of Walking Barefoot


  చెప్పుల్లేకుండా నడవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు 


అర్యోగం Health : ఆధునిక కాలంలో ప్రతీది ఓ ఫ్యాషన్‌లానే చూస్తున్నారు. వాకింగ్‌కు షూ, మార్కెట్‌కు వెళ్లాలంటే స్లిప్పర్, ఆఫీస్‌లో ఫార్మల్ షూ, ఆటలకు స్పోర్ట్స్ షూ, ఆకరికీ ఇంట్లోని పాలిష్ బండలపై నడవడానికి కూడా స్మూతైన చెప్పులు వాడుతూ పాదాలకు ఎక్కడా గరుకు తగిలకుండా రక్షణ కల్పిస్తున్నారని అనుకుంటారు. అది రక్షణ కాదు శరీరానికి వేసుకునే శిక్ష అని తెలియదు. చెప్పులు లేకుండా నడవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజూ కాకపోయినా కనీసం వారానికి ఒకసారి అయినా చెప్పులేకుండా కిలోమీటర్ నడిచి చూడండి. శరీరంలో జరిగే మార్పులు గమనించండి. పూర్వీకులు నిరంతరం గతుకుల రోడ్లపై, పొలం గట్ల వెంబడి చెప్పుల్లేకుండా నడవడం వల్ల మారు చాలా యాక్టివ్‌గా ఉండేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. స్టెల్, ఫ్యాషన్ పేరుతో బెడ్ రూంలో కూడా చెప్పులేసుకుని తిరుగుతున్నారు. ఉదయం మంచం దిగింది మొదలు రాత్రి పడుకునే వరకు పాదాలకు చెప్పులు ఉండాల్సిందే. దీంతో పాదాలు అందంగా ఉంటాయి అనుకుంటారు. అందం విషయం పక్కన పెడితే ఆనారోగ్యం బారిన పడతారు. అరోగ్యం కంటే అందం ముఖ్యం కాదు కదా!

చెప్పుల్లేకుండా నడవడం వల్ల కలిగే మార్పులు 

1. శరీర భంగిమ సరిగ్గా ఉంటుంది. సహనం కూడా పెరుగుతుంది.

2. పొత్తి కడుపుపై ఒత్తిడి కలిగి, జీర్ణక్రియ సక్రమంగా ఉంటుంది.

3. చిన్న చిన్న రాళ్లు పాదాలకు గుచ్చుకోవడం వల్ల పాదాలలో రక్తప్రసరణ పనితీరు మెరుగవుతుంది. బీపీ కంట్రోల్‌లో ఉంటుంది.

4. మానవుని పాదాల్లో 72 వేల నరాల కొనలు ఉంటాయి. ఎక్కువసేపు పాదారక్షలు వాడడం వల్ల సున్నితమైన నరాలు చచ్చుబడిపోతాయి. అదే చెప్పుల్లేకుండా నడవడం వల్ల ఈ నరాలు యాక్టివ్‌గా ఉంటాయి.

కాబటి పార్కుల్లో, ఆఫీసుల్లో, ఇంట్లో చెప్పుల్లేకుండా నడిచే అలవాటును అలవర్చుకోండి. ఆరోగ్యంగా ఉండండి.

వయసును బట్టి ఎంత నడవాలి ?

40 సంవత్సరాలు కంటే తక్కువ వయసు ఉన్నవారు ప్రతిరోజూ కనీసం 3.75 కి.మీ. నడవాలి.

45 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకు వయసున్నవారు ప్రతిరోజూ కనీసం 3.5 కి.మీ. నడవాలి.

50 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల వరకు వయసున్నవారు ప్రతిరోజూ కనీసం 3.1 కి.మీ. నడవాలి.

55 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు వయసున్నవారు ప్రతిరోజూ కనీసం 3.5 కి.మీ. నడవాలి.

60 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవారు ప్రతిరోజూ కనీసం 2.5 కి.మీ. నడవాలి.

ఒక సర్వే ప్రకారం ఎవరైతే ప్రతి వారం కనీసం 2 గం. నడుస్తారో.. మిగతావారి కన్నా 40 శాతం ఆరోగ్యంగా ఉన్నారని నిర్దారణ అయింది.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies