తాండూర్ పట్టణంలో జరగబోయే ర్యాలీ కార్యక్రమాన్ని దిగ్విజయం చేద్దాం
తాండూర్ Tandur News భారత్ ప్రతినిధి : ఆదివారం నాడు ఉదయం 10:00 గంటలకు గౌరవ మంత్రివర్యులు మహేందర్ రెడ్డి గారు, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి గారు, గౌరవ తాండూరు శాసనసభ్యులు పైలెట్ రోహిత్ రెడ్డి అన్నగారు, తాండూర్ పట్టణానికి విచ్చేయుచున్న సందర్భంగా బషీరాబాద్ మండల కేంద్రంలో మండల అధ్యక్షులు నర్సిరెడ్డి (రాజు పటేల్) గారి ఆధ్వర్యంలో పలు గ్రామాల్లో పర్యటించి ఈరోజు బషీరాబాద్ మండల ప్రజా ప్రతినిధులతో కలిసి రేపు జరగబోయే కార్యక్రమాల గురించి ప్రజలకు తెలపడం జరిగింది. కార్యక్రమాల వివరాలు తాండూర్ పట్టణంలో గల విలియం మూస్ చౌరస్తా నుండి రైల్వే రోడ్డు వైపుగా ర్యాలీ ప్రారంభం మధ్యాహ్నం 12:00 గంటలకు సభ ప్రారంభం మధ్యాహ్నం 2:00 గంటలకు ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో భోజన సదుపాయం కలదు. ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నPACS చైర్మన్ వెంకట్ రామ్ రెడ్డి, మరియు బషీరాబాద్ మండల పార్టీ మాజీ అధ్యక్షులు రాములు నాయక్, కోఆప్షన్ నెంబర్ రజాక్, నాయకులు సుధాకర్ రెడ్డి, నరేష్ చౌహన్, మరియు మండల ప్రజా ప్రతినిధులు గ్రామ సర్పంచులు ఎంపీటీసీలు బి.ఆర్.ఎస్ పార్టీ కార్యకర్తలు రోహితన్న యువ సైన్యం సభ్యులు ప్రజా బంధు టీం తదితరులు పాల్గొన్నారు.