తాండూరు ఎమ్మెల్యే గారిని కలిసిన స్టోన్ మర్చంట్ అసోసియేషన్ సభ్యులు
తాండూర్ Tandur News భారత్ ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారిని ఈరోజు తాండూరు స్టోన్ మర్చంట్ అసోసియేషన్ సభ్యులు మరియు క్వారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు ఎమ్మెల్యే ను సన్మానించి వచ్చే ఎన్నికలలో తాండూరు నుండి బీఅర్ఎస్ అభ్యర్ధి గా ఖరారు అయినందున శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు స్టోన్ మర్చంట్ అధ్యక్షుడు నయ్యుం అఫ్ఫు, ప్రధాన కార్యదర్శి ఫయాజ్ బేగ్, క్వారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అబ్దుల్ రౌఫ్, జుబైర్ లాలా మరియు సోమాని గఫూర్ పాషా, జైనోధిన్, అన్వర్ తదితరులు పాల్గొన్నారు.