నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం లో పాల్గొన్న మంత్రి వర్యులు మరియు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారు
వికారాబాద్ Vikarabad News భారత్ ప్రతినిధి : వికారాబాద్ : కోటపల్లి మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం లో పాల్గొన్న రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు మరియు గనుల శాఖ మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి.పాల్గొన్న ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, రోహిత్ రెడ్డి, సీనియర్ నాయకుడు కర్ణం పురుషోత్తం రావు, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మెన్ రాజుగౌడ్.రైతుల ర్యాలీలో పాల్గొన్న మంత్రి మహేందర్ రెడ్డి.మంత్రి మహేందర్ రెడ్డి కామెంట్ కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ లో ఇచ్చిన 6 గ్యారంటీ డిక్లరేషన్ లను కర్ణాటకలో ముందు అమలు చేయాలి.కర్ణాటక లో రైతు బీమా లేదు, రైతు బంధు లేదు, రైతులకు కరెంటు లేదు.తెలంగాణలో ప్రజలను, రైతులను మభ్య పెట్టేందుకు కాంగ్రెస్ కుట్రలు చేస్తుందని మహేందర్ రెడ్డి ఘాటుగా విమర్శించారు.సీఎం కేసీఆర్ చేస్తున్న పథకాలను నేరుగాంచేందుకు చూసి ఓర్వలేక ఆరోపణ చేస్తున్నారు.జిల్లాలో 65 వేల మంది రైతులకు 353 కోట్ల రుణమాఫీ జరిగింది.కొత్త జిల్లాలు, కొత్త మండలాలు, కొత్త మార్కెట్లు, కొత్త కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కింది.రంగారెడ్డి జిల్లాలో గోదాంల నిర్మాణానికి 38 కోట్లు అందించాం.వికారాబాద్ జిల్లాలో సుమారు 3000 కోట్ల రైతుబంధు రైతులకు అందించాం.జిల్లాలో 236 కోట్ల రైతు బీమాను ప్రమాదవశత్తు మృతి చెందిన రైతులకు అందించాం.ఈ పథకాలు కర్ణాటకలో ఉన్నాయా అంటూ మంత్రి ప్రశ్నించారు.