మంత్రివర్యులు, ఎమ్మెల్యే, ఎంపీలకు తాండూర్ ప్రజల ఘన సన్మానం
తాండూర్ Tandur News భారత్ ప్రతినిధి : గౌరవ మంత్రివర్యులు మరియు తాండూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే చేవెళ్ల పార్లమెంట్ ఎంపీ గార్లకు తాండూర్ నియోజకవర్గ ప్రజల ఘన సన్మాన కార్యక్రమం రేపు అనగా తేదీ 03-09-23 ఆదివారం ఉదయం 10:00 గంటలకు తాండూరు పట్టణం విలియం మూన్ చౌరస్తా నుండి తాండూర్ ప్రజల భారీ గులాబీ ర్యాలీతో పాటు రైల్వే స్టేషన్ వద్ద జరిగే బహిరంగ సభ ఏర్పాటు చేయబడింది.ముఖ్య అతిథులు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు పట్నం మహేందర్ రెడ్డి గారు, మరియు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ జి. రంజిత్ రెడ్డి గారితో కలిసి తాండూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారు పాల్గొని ప్రసంగిస్తారు.
తదుపరి తాండూర్ పట్టణం నందు జూనియర్ కళాశాల మైదానంలో మధ్యాహ్నం 2:00 గంటలకు భోజన సదుపాయం కలదు. ఇట్టి కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ మరియు మున్సిపల్ చైర్ పర్సన్, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ మరియు మున్సిపల్ కౌన్సిలర్లు అలాగే మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ అలాగే మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ లు, మరియు చైర్మన్లు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు, కోఆప్షన్ మెంబర్లు, దేవాలయ చైర్మన్లు, ఉర్దూగర్ చైర్మన్, మరియు (బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ) అధ్యక్ష కార్యదర్శులు, అలాగే వార్డు యొక్క అధ్యక్ష కార్యదర్శులు, మరియు బిఆర్ఎస్ పార్టీ పెద్దలు మరియు నాయకులు అభిమానులు అలాగే యువజన విభాగం సభ్యులు, మహిళా విభాగం, సభ్యులు, బిఅరెస్ కార్మిక విభాగం,రోహిత్ అన్నయువ సైన్యం సభ్యులు, మరియు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ పాల్గొనవలసిందిగా మనవి.