మట్టికథ సినిమా బృందాన్ని అభినందించిన ఎమ్మెల్యే
తాండూరు Tandur News భారత్ ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణానికి చెందిన పవన్ కడియాల కథ మరియు దర్శకత్వంలో నిర్మించిన మట్టి కథ చిత్రం ఇండో ఫ్రెంచ్ ఫిలిం ఫెస్టివల్ తో పాటు పలు అంతర్జాతీయ వేదికల్లో ఉత్తమ చిత్రంగా నిలవడం పట్ల ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారు ఈరోజు తాండూరులోని ఆయన నివాసంలో మట్టికథ సినిమా బృందాన్ని అభినందించారు. స్థానికుడు పవన్ కడియాల సినిమా రంగంలో రాణించడం అభినందనీయం అని యువత ఇలాంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు.