ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటున్న ఎమ్మెల్యే
పెద్దేముల్ peddemul News భారత్ ప్రతినిధి : వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం తింసాన్ పల్లి గ్రామానికి చెందిన బంటు గోపాల్ కూతురు సంగీత అనారోగ్యంతో బాద పడుతుంది. ఆమెకు వైద్యం చేయించడానికి డబ్బులు లేక తండ్రి గోపాల్ గ్రామ నాయకులైన గుడిసె శ్రీనివాస్, పగిడ్యాల మాదవరెడ్డితో కలిసి మండల BRS పార్టీ అధ్యక్షులు కోహిర్ శ్రీనివాస్ గారికి ఆదివారం రోజున తెలియజేయగా వెంటనే MLA గారితో మాట్లాడి రెండు రోజుల్లో 2 లక్షల 50 వేలు LOC ఇప్పించడం జరిగింది. తల్లిదండ్రులు MLA రోహిత్ రెడ్డి గారికి క్రుతజ్ఞతలు తెలియజేసారు అలాగే మండల ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ పతకాల గురించి ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఆపదలో ఆదుకుంటున్న పెద్దేముల్ మండల BRS పార్టీ అధ్యక్షులు కోహిర్ శ్రీనివాస్ గారిని అభినందిచినారు.