తండావాసుల రోడ్డు సమస్య తీర్చిన ఎమ్మెల్యే
బషీరాబాద్ Basheerabad News భారత్ ప్రతినిధి : వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం తౌర్య నాయక్ తాoడ మరియు పర్షానాయక్ తాండ గ్రామ ప్రజలు ఎన్నో ఏళ్లుగా బషీరాబాద్ వెళ్లడానికి రోడ్డు లేనందున ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది.ఆట్టి విషయాన్ని బషీరాబాద్ మండల్ పార్టీ అధ్యక్షులు నర్సిరెడ్డి గారికి తెలపడం జరిగింది.వెంటనే అట్టి విషయాన్ని గౌరవ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారికి తెలపడంతో ఈరోజు మాసన్ పల్లి గ్రామానికి వెళ్లి తాండవాసులతో చర్చించి ఏదైతే బషీరాబాద్ మార్గానికి వెళ్లే రోడ్డు మార్గానికి సంబంధించిన భూమిని పరిశీలించి అట్టి భూ యజమాని సురేష్ దొరగారితో ఎమ్మెల్యే గారికి ఫోన్లో మాట్లాడించడం జరిగింది.అలాగే ఎమ్మెల్యే గారు సురేష్ దొరగారికి తండావాసుల రోడ్డు సమస్య కొరకు మీ భూమిలో కొంత భాగం రోడ్డు మర్గనికి అవసరం పడుతుంది కాబట్టి అట్టి స్థలాన్ని మీరు ఇవ్వాల్సిందిగా కోరారు.అందుకు సానుకూలంగా స్పందించిన భూ యజమాని సురేష్ దొరగారు ఎమ్మెల్యే గారితో త్వరలో భేటీ అయి ఇట్టి స్థలాన్ని కేటాయిస్తానని తెలపడం జరిగింది.ఇట్టి సమస్యని బషీరాబాద్ మండల అధ్యక్షులు నర్సిరెడ్డి (రాజు పటేల్) గారు స్వయంగా దగ్గరుండి పరిష్కరించినందున తాండ ప్రజలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈట్టి కార్యక్రమంలో మాసన్ పల్లి గ్రామ ప్రజలు, తాండ ప్రజలు పాల్గొన్నారు.