ఫలించిన ఎమ్మెల్యే గారి కృషి
బషీరాబాద్ Basheerabad News భారత్ ప్రతినిధి : వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలానికి ప్రభుత్వ జూనియర్ కళాశాల మంజూరు పై హర్షం వ్యక్తం చేసిన మండల విద్యార్థులు.తాండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ పైలెట్ రోహిత్ రెడ్డి గారి కృషివల్లే మండలానికి ప్రభుత్వ జూనియర్ కళాశాల మంజూరు అవ్వడం జరిగింది.ఇమేరకు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. నాయకులు మాట్లాడుతూ...ఎన్నో ఏళ్లుగా బషీరాబాద్ మండలానికి ప్రభుత్వ జూనియర్ కళాశాల లేనందున విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు గత ప్రభుత్వాలకు పలుమార్లు విద్యార్థి సంఘాలు నాయకులు అర్జీలు పెట్టుకున్న పట్టించుకున్న నాధుడే లేకపోయాడు కానీ గౌరవ ఎమ్మెల్యే శ్రీ పైలట్ రోహిత్ రెడ్డి గారికి ఇట్టి విషయాన్నినాయకులు విద్యార్థి సంఘాలు తెలపడంతో తనే స్వయంగా అట్టి సమస్యను ప్రభుత్వానికి తెలియజేసి ప్రభుత్వ జూనియర్ కళాశాలను మంజూరు చేయించుకోవడం జరిగింది.బషీరాబాద్ మండల విద్యార్థుల చిరకాల స్వప్నాన్ని తీర్చిన ఎమ్మెల్యే గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.విద్యార్థుల పట్ల అంకితభావంతో కృషి చేస్తున్న ఎమ్మెల్యే గారికి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు అభినందనలు తెలిపారు.ఇట్టి కార్యక్రమంలో బషీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు నర్సిరెడ్డి, ప్రజా ప్రతినిధులు, నియోజకవర్గ విద్యార్థి విభాగం ఇన్చార్జి జిలాని నియోజకవర్గ అధ్యక్షులు ఎబినేజర్ బషీరాబాద్ సర్పంచ్ మాధవ రెడ్డి మాజీ పార్టీ అధ్యక్షులు రాముల నాయక్ యూత్ అధ్యక్షులు తాహెర్ బాండ్ స్వామి వివేకానంద యూత్ అధ్యక్షుడు రాఘవేందర్ చారి ఏఎంసీ డైరెక్టర్లు నరేష్ చౌహన్ జగదీష్ వార్డ్ మెంబర్ సిద్దు రఘు పంతులు యంగ్ లీడర్ లక్ష్మణ్ విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.