Type Here to Get Search Results !

Sports Ad

దేశం పేరు ఇక 'భారత్‌'? తీర్మానం చేసే యోచనలో కేంద్రం..The name of the country is 'India'? The Center is thinking of making a decision.


 దేశం పేరు ఇక 'భారత్‌'? తీర్మానం చేసే యోచనలో కేంద్రం..

ఢిల్లీ Delhi News భారత్ ప్రతినిధి : మన దేశం పేరును ఆంగ్లంలోనూ 'ఇండియా (India)' నుంచి 'భారత్‌ (Bharat)'గా మార్చనున్నారా? రాజ్యాంగాన్ని సవరించి తీర్మానం చేయనున్నారా? ప్రస్తుత రాజకీయ పరిణామాలతో ఇప్పుడు ఈ ఊహాగానాలు జోరందుకున్నాయి. అసలేం జరిగిందంటే.భారత్‌ అధ్యక్షతన ఈ వారాంతంలో జీ-20 శిఖరాగ్ర సదస్సు (G20 Summit) జరగనుంది. ఈ సమావేశానికి ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల అధినేతలు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలోనే వీరికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సెప్టెంబరు 9వ తేదీన ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. ఇందుకోసం రాష్ట్రపతి భవన్‌ నుంచి ఇప్పటికే అతిథులకు ఆహ్వానం అందింది. అయితే, ఈ ఆహ్వానంపై President of India అని బదులుగా President of Bharat అని ముద్రించి ఉండటం ప్రాధాన్యత సంతరించుకుంది.తమకు అందిన ఆహ్వానంలో ఈ మార్పును గుర్తించిన కాంగ్రెస్‌ పార్టీ ట్విటర్‌ వేదికగా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది. ''జీ-20 విందు కోసం President of India బదులుగా President of Bharat అనే పేరుతో రాష్ట్రపతి భవన్‌ ఆహ్వానం పంపింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 1లో ఇంతకుముందు 'ఇండియా: అది భారత్‌' అని ఉంటుంది. కానీ ఇప్పుడు మోదీ సర్కార్‌ వల్ల దీన్ని.. 'భారత్‌, అది ఇండియా, రాష్ట్రాల సమాఖ్య' అని చదవాలి. ఇది రాష్ట్రాల సమాఖ్యపైనా జరుగుతోన్న దాడి'' అని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ సామాజిక మాధ్యమాల వేదికగా కేంద్రంపై ధ్వజమెత్తారు.

మరిన్ని వార్తల కోసం... 
* రెట్రో వాకింగ్​తో బరువు తగ్గొచ్చు.. మోకాళ్ల నొప్పులు తగ్గించుకోవచ్చు ఇక్కడ క్లిక్ చేయండి
* ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటున్న ఎమ్మెల్యే ఇక్కడ క్లిక్ చేయండి
* ఉపవాసం చేయడం వలన వివిధ అవయవాలలో కలుగు మార్పులు ఇక్కడ క్లిక్ చేయండి 
* దేశం పేరు ఇక 'భారత్‌'? తీర్మానం చేసే యోచనలో కేంద్రం.. ఇక్కడ క్లిక్ చేయండి
* రుణమాఫీ అయిన రైతులకు కొత్త రుణాలు ఇవ్వాలి మంత్రి హరీష్ రావు కీలక ఆదేశాలు ఇక్కడ క్లిక్ చేయండి

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies