మానసిక ఒత్తిడి పోయి మానసిక ఆరోగ్యం బాగుండాలి అంటే ఏం చేయాలి అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు
ఆరోగ్యం Health : మనసుకు చాలా కష్టం కలిగినప్పుడు మెదడు ఎంతో ఒత్తిడికి గురవుతుంది.తక్కువ స్ధాయిలో వుండే ఒత్తిడి, ఉద్రిక్తత కొన్ని సందర్భాలలో లాభదాయకంగానే ఉంటాయి.ఉదాహరణకుః ఒక ప్రోజెక్ట్ లేక మరేదైనా పనిని నిర్వహస్తున్నప్పుడు తక్కువ స్ధాయిలో ఒత్తిడికి గురవుతున్నట్లుండే భావం, మనల్ని మనం చేసే పనిని దానిమీదే మరిం తగా దృష్టిని కేంద్రీకరించి ఉండగలిగేటట్లు మరియు పనిని మరింత బాగా, మరింత శక్తివంతంగా, ఉత్సాహవంతంగా పూర్తి చేసేటట్లు చేస్తుంది, ఒత్తిడిలో రెండు రకాలున్నాయి స్ట్రెస్ (‘అనుకూలవంతమైన ప్రోత్సాహకరమైన ఒత్తిడి’) మరియు డిస్ట్రెస్ (‘ప్రతికూలమైన, నిరుత్సాహకరమైన ఒత్తిడి‘) ఉజ్జాయింపున చెప్పాలంటే ఛాలెంజ్ మరియు అదనపు బరువు. ఒత్తిడి ఉధృతంగా ఉన్నప్పుడు లేక అతి తక్కువగా అదుపులో ఉన్నప్పుడు, అలాగే నిర్వహింపబడుతున్నప్పుడు, అది ప్రతికూలమైన సానుకూలం కానటువంటి ప్రభావాలకు కారణమవుతుంది.
ఒత్తిడిని కలిగించే సామాన్య మూలాధారాలు
బతికి బయటపడడానికి సహకరించే ఒత్తడి
ఎవరైనా, ఏదైనా తనకు భౌతికంగా హాని కలిగించవచ్చని భయపడుతూ ఉన్నప్పుడు ఏ వ్యక్తికైనా శరీరం సహజంగానే పూర్తి శక్తితో విజృంభిస్తుంది, అతను ఈ ప్రమాదకరమైన ఘటన (కొట్లాట)నుండి బతికి బయట పడేలాగ లేకపోతే అసలు మొత్తంమీద అటువంటి పరస్ధితినుండి పూర్తిగా తప్పించుకునే (ఎగిరి, పారిపోవడం).లాగ ఇది బతికి మనుగడ సాగించడానికి ఉపకరించే ఒత్తిడి. ఒత్తిడితో తట్టుకుని ఉండగలగడంలో అనుసరించే అనారోగ్యకరమైన మార్గాలు ఒత్తిడికి తట్టుకునేందుకు ఉపయోగించే ఈ వ్యూహాలు దానిని తాత్కాలికంగా తగ్గించవచ్చు, కాని, దీర్ఘకాలంలో ఇవి మరింత హానిని కలుగజేయవచ్చు.
1.పొగత్రాగడం
2.అతిగా మద్యం సేవించడం
3.అతి ఎక్కువగా గాని లేక అతి తక్కువగా గాని తినడం
4.టి.వి. ముందు గాని లేక కంప్యూటర్ ముందుగాని గంటల తరబడి అలాగే అంటిపెట్టుకుని కూర్చుని ఉండడం
5.స్నేహితుల వద్ద నుండి గాని, కుటుంబాన్నుండి గానీ లేక ఇతర కార్యకలాపాలనుండి గాని విరమించుకోవడం అంటే వైదొలగడం.
6.సేద తీర్చుకోవడానికి బిళ్లలను లేక మాదక ద్రవ్యాలను ఉపయోగించడం
7.అతిగా నిద్ర పోవడం
8.దేన్నైనా ఊరికే సాగదీయడం, తాత్సారం చేయడం
9.సమస్యలనుండి తప్పించుకోవడానికి రోజులో ప్రతి నిముషం కూడా వినియోగిస్తూ ఉండడం
10.ఇతరులపై మీ ఒత్తిడిని చూపించడం (వారిపై విరుచుకు పడుతూ ఉండడం, కోపంతో ఒక్కసారిగా ఉద్రిక్తులవుతూ ఉండడం, శారీరక హింస)
11.ఒత్తిడిని తట్టుకుని, దానిని చక్కగా అదుపుచేస్తూ, సరైన రీతిలో నిర్వహించుకుంటూ ఉండడానికి అనేక పధ్దతులున్నాయి. అయితే, ఇవన్నీ కూడా మార్పును ఆశిస్తున్నాయి. పరిస్ధితిని, సంఘటనను మనం మార్చడమేనా చెయ్యాలి లేదా మన ప్రతిస్పందననైనా మార్చుకుంటూ ఉండాలి. దీనిని గురించి తీక్షణంగా ఆలోచించి, ఈ ఒత్తిడికి మూలమైన కారణాలను గురించి ఇతరులతో కూడా మాట్లాడండి. అలాగే వీటిని నివారించడానికి, తగ్గించుకోవడానికి ఈ ఒత్తిడికి గల కారణాలనుండి అటువంటి పరిస్ధితినుండి, ఒత్తిడికి గురైన వ్యక్తిని తప్పించడానికి తగిన చర్యలు తీసుకోండి.
13.ఒత్తిడిని అదుపుచేయడంలోనూ, దాని సరైన నిర్వహణలోనూ, మీ నిర్వహణా విధానాన్ని మరింత మెరుగు పరచడానికి, అభివృధ్ది చేయడానికి మీ ధృక్ఫధం, మీరు చేపట్టే చర్యలు, అనుసరించే విధానం చాలా ముఖ్యమైనవని గ్రహిస్తూ, ఒత్తిడికి గురైన వ్యక్తి నుండి దానికి గల కారణాలను, దీనిలో ఉండే వివిధ రకాలను గురించి అర్ధంచేసుకోండి, అలాగే ఈ ఒత్తిడిని కలిగించే పరిస్ధితి రావడానికి సహకరించే అంశాలను గురించి కూడా ఆలోచించండి.మీ లో ఒత్తిడి ఎక్కువ ఉంటే యోగ లో సుదర్శన్ క్రియ లింక్స్ లో చూడాలి.