యాలాల మండలంలో పైలెట్ ఆత్మీయ పలకరింపు
యాలాల Yalala News భారత్ ప్రతినిధి : వికారాబాద్ జిల్లా యాలాల మండలం పైలెట్ ఆత్మీయ పలకరింపు కార్యక్రమం బుధవారం ప్రారంభం అయింది. మండల పరిధిలోని రాస్నం గ్రామం వేదికగా గౌరవ ఎమ్మెల్యే శ్రీ పైలెట్ రోహిత్ రెడ్డి గారు గంగాసాగర్, సంగాయిపల్లి తండా, సంగాయిపల్లి కింది తండా, సంగాయిపల్లి మీది తండాల బీఅర్ఎస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను కలిసి వారి క్షేమ సమాచారాలను తెలుసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో మూడవసారి అధికారం చేపట్టబోతునదని కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని కోరారు.