ఎమ్మెల్యే గారి ప్రత్యేక చొరవతో నెరవేరిన తండావాసుల రోడ్డు సమస్య
బషీరాబాద్ Basheerabad News భారత్ ప్రతినిధి : వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం తౌర్య నాయక్ తాoడ మరియు పర్షానాయక్ తాండ గ్రామ ప్రజల చిరకాల రోడ్డు సమస్యని పరిష్కరించి వెంటనే అట్టి రోడ్డు పనులను ప్రారంభించాలని ఆదేశించిన తాండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారు. గ్రామ ప్రజలు మాట్లాడుతూ మా యొక్క తాండలు తౌర్య నాయక్ తాoడ, మరియు పర్షా నాయక్ తాoడ గ్రామ ప్రజలకు రోడ్డు మార్గం లేనందుల ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవడం జరిగింది అట్టి విషయాన్ని ఎమ్మెల్యే గారికి తెలియజేయడంతో వెంటనే స్వయంగా ఎమ్మెల్యే గారు భూయజమానితో మాట్లాడి అన్ని తానై ఇట్టి రోడ్డు సమస్యని తీర్చి మా గ్రామ ప్రజలకు రోడ్డు మార్గాన్ని వేయిస్తున్నా ఎమ్మెల్యే గారికి మా తాండ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం.ఇట్టి సమస్యని బషీరాబాద్ మండల అధ్యక్షులు నర్సిరెడ్డి (రాజు పటేల్) గారు ప్రత్యేక చొరవ తీసుకున్నందున వారికి మా తాండవాసుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలుఈట్టి కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీశైల్ రెడ్డి గారు, మరియు పిఎసిఎస్ చైర్మన్ వెంకట్ రామ్ రెడ్డి గారు, బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు,తాండ ప్రజలు పాల్గొన్నారు.